Share News

KALAVA CAMPAIN: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:32 AM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువత కోసం మెగా డీఎస్సీపైనే తొలిసంతకం చేయనున్నట్లు కూ టమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నా రు. సోమవారం పట్టణంలోని 24వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.

KALAVA CAMPAIN: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం
ఓటు అభ్యర్థిస్తున్న కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, ఏప్రిల్‌ 29: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువత కోసం మెగా డీఎస్సీపైనే తొలిసంతకం చేయనున్నట్లు కూ టమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నా రు. సోమవారం పట్టణంలోని 24వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఆయనతో పాటు జనసేన నియోజకవర్గ ఇనచార్జి మంజునాథగౌడ్‌, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన గౌస్‌ పాల్గొన్నారు. ఓటర్లకు సూపర్‌సిక్స్‌ పథకాల గురించి వివరించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు.


50 కుటుంబాలు చేరిక

కణేకల్లు మండలంలోని గోపులాపురం గ్రామానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు, గుమ్మఘట్ట మండలంలోని ఆర్‌ కొత్తపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఆర్‌ కొత్తపల్లికి చెందిన జశ్వంత, ప్రహ్లాద, తిప్పేస్వామి, రామాంజనేయులు, పెన్నప్ప, ఎల్లప్ప, శ్రీనివాసులు, రామచంద్ర, వన్నూరుస్వామి, ఉమేష్‌, మారెన్న, రమేష్‌, అభిషేక్‌లతో పాటు 30 కుటుంబాలు చేరాయి. గోపులాపురం గ్రామానికి చెందిన హనుమప్ప, ప్రవీణ్‌, రవి, ప్రభాకర, ఆంజనేయులతో పాటు ఐదు కుటుంబాలు చేరాయి. వీరికి కాలవ శ్రీనివాసులు తన నివాసంలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.


కుటుంబ సభ్యుల ప్రచారం: తన తండ్రిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కాలవ శ్రీనివాసులు కుమార్తె కాలవ గౌతమి సోమవారం కణేకల్లు మండలంలోని యర్రగుంట గ్రామంలో, తనయుడు కాలవ భరత గుమ్మఘట్ట మండలంలోని వీరాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే విధంగా డీ.హీరేహాళ్‌ మండలంలోని గొడిశలపల్లిలో అల్లుడు అనిల్‌కుమార్‌ ప్రచారం చేశారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో..: కాలవ శ్రీనివాసులును గెలిపించాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్‌, ప్రధాన కార్యదర్శి వెంక టేష్‌ ఎన్నికల ప్రచారాన్ని డీ.హీరేహాళ్‌ మండలంలో ఓబుళాపురం, జాజరకల్లు, డీ.హీరేహాళ్‌, లింగమనహళ్లిలోని ఎస్సీ కాలనీలలో ప్రచారం చేశారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 30 , 2024 | 12:32 AM