Share News

JUDGES MEETING: మనుషులు కలిపే మధ్యవర్తిత్వ చట్టం

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:24 AM

వివాదాల్లో ఇరుక్కుని విడిపోయిన మనుషులను మధ్యవర్తిత్వ చట్టం ద్వారా కలుసుకునే అవకాశం ఉం దని న్యాయాధికారులు ఎస్‌ ప్రతిమ, పీ మీనాక్షి సుందరి అన్నారు.

JUDGES MEETING: మనుషులు కలిపే మధ్యవర్తిత్వ చట్టం
A statue of a magistrate speaking

న్యాయాధికారులు ప్రతిమ, మీనాక్షిసుందరి

కదిరిలీగల్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): వివాదాల్లో ఇరుక్కుని విడిపోయిన మనుషులను మధ్యవర్తిత్వ చట్టం ద్వారా కలుసుకునే అవకాశం ఉం దని న్యాయాధికారులు ఎస్‌ ప్రతిమ, పీ మీనాక్షి సుందరి అన్నారు. శనివారం మధ్యవర్తిత్వ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న న్యాయాధికారులు మాట్లాడుతూ మధ్యవర్తిత్వ చట్టం ఆవశ్యకతను వివరించారు. కేసులు పరిష్కారం కాక ఏళ్ల తరబడి వ్యయప్రయాసలు, ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యే పరిస్థితుల్లో మధ్యవర్తిత్వ చట్టం ద్వారా ఉపశమనం పొందవచ్చన్నారు. మధ్యవర్తిత్వం నిర్వహించే వ్యకి తటస్తుడుగా కలివిడిగా ఇరువర్గాల మనోభావాలు గాయపరచకుండా వ్యవహరించే వ్యక్తిగా ఉండాలన్నారు. తన బుద్ధికుశలతతో సమస్యను ఇరువర్గాలు పరిష్కరించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మధ్యవర్తి ద్వారా పరిష్కరించిన సమస్య ఒప్పంద పత్రం ద్వారా కోర్టుకు ఇచ్చిన తరువాత డిక్రీ పత్రంగా పొందగలగుతారని అన్నారు. ఇరువర్గాల ఆమోదంతోనే సమస్య పరిష్కరమవుతుందన్నారు. తిరిగి సమస్యలు తలెత్తే ప్రసక్తే ఉండదన్నారు. మధ్యవర్తి చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడగలదని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేందర్‌రెడ్డి, సురేంద్రచౌదరి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 12:24 AM