Share News

COLLECTOR : బడి మెరుగుపడాలి

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:02 AM

ప్రభుత్వ పాఠశాలల పనితీరు మరింత మెరుగుపడాలని విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలను కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. విద్యాశాఖ, ఎస్‌ఎ్‌సఏ పరిధిలో పథకాలు, అభివృద్ధి పనులు, పెండింగ్‌ పనుల గురించి కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు పెండింగ్‌ పనుల వివరాలను ఇవ్వాలని సూ చించారు. పాఠశాలలు ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని అన్నారు. కొన్ని మండలాలలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ, ఎస్‌ఎ్‌సఏ ...

COLLECTOR : బడి మెరుగుపడాలి
Collector Vinod Kumar speaking in the review

పిల్లలందరూ పాఠశాలల్లో ఉండాలి

విద్యాశాఖ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

్ఞఅనంతపురం టౌన, జూలై 11: ప్రభుత్వ పాఠశాలల పనితీరు మరింత మెరుగుపడాలని విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలను కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. విద్యాశాఖ, ఎస్‌ఎ్‌సఏ పరిధిలో పథకాలు, అభివృద్ధి పనులు, పెండింగ్‌ పనుల గురించి కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు పెండింగ్‌ పనుల వివరాలను ఇవ్వాలని సూ చించారు. పాఠశాలలు ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని అన్నారు. కొన్ని మండలాలలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ, ఎస్‌ఎ్‌సఏ అధికారులు, ఎంఈఓల పనితీరు మరింత మెరుగుపడాలని అన్నారు. కేజీబీవీలలో ఇంటర్‌ ఉత్తీర్ణత ఏటా తగ్గుతోందని, ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ‘నేను బడికి పోతా’ కార్యక్రమంలో భాగంగా బడిఈడు పిల్లలు


వందశాతం బడిలో ఉండేలా చర్యలు తీపుకోవాలని సూచించారు. ఉరవకొండలో ఒక్కటే బడి బయట ఉన్న 1,617 మందిని గుర్తించారని, మిగిలిన మండలాలలో ఎందుకు గుర్తించలేదని కలెక్టరు ప్రశ్నించారు. అన్ని మండలాలలో వారంలోగా వందశాతం పిల్లలను బడిలో చేర్పించి నివేదికలు ఇవ్వాలని హెచ్చరించారు. షెడ్యూల్‌ వచ్చిన తర్వాత జ్ఞానజ్యోతి కింద ఎస్‌జీటీలకు, అంగనవాడీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యాపథకాలు, సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. విద్యార్థుల కిట్లలో యూనిఫామ్స్‌, బ్యాగ్స్‌, డిక్షనరీలు, బూట్లు, పాఠ్య పుస్తకాలను త్వరగా పంపిణీ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు విషయంలో సాకులు చెప్పవద్దని, భోజనం వండకపోతే మీదే బాధ్యత అని అధికారులతో అన్నా రు. విద్యార్థులు పాఠశాలల బయట భోజనం తినకూడదని అన్నారు. చిక్కీల గడువును ఎప్పటికపుడు పరిశీలించాలని, కాలం గడిచిన వాటిని పిల్లలకు పంపిణీ చేయకూడదని అన్నా రు. విద్యాశాఖలో అధికారుల నుంచి వాచమెన వరకూ క్యాడర్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అందజేయాలని డీఈఓకు సూచించారు. సమావేశంలో డీఈఓ వరలక్ష్మీ, ఏడీలు కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 12 , 2024 | 12:02 AM