Share News

SAVITA : ఒక్క చాన్సతో రాష్ట్రం అధోగతి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:08 AM

వైసీపీకి ఓటేసి ఒక్క ఛాన్స ఇవ్వడంతో రాష్ట్రం అధోగతి పట్టిందని, మళ్లీ వైసీపీకి ఓటేస్తే సర్వనాశనం అవుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. టీడీపీ సంక్షేమం, అభివృద్ధి జరిగాయన్నారు. ఆమె ఆదివారం మండలంలోని గొందిపల్లి, దుద్దేబండ, చంద్రగిరి, గొల్లపల్లి, గోనిపేట, రాంపురం, గ్రామాల్లో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాల్లో గజమాలలు, పూలు, హారతులతో మహిళలు ఆమెను ఆశీర్వదించారు. ఆమె టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.

SAVITA : ఒక్క చాన్సతో రాష్ట్రం అధోగతి
Crowd gathered in Chandragiri village

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

పలు గ్రామాల్లో భారీ

జనసందోహం మధ్య ప్రచారం

పెనుకొండ రూరల్‌, ఏప్రిల్‌ 28 : వైసీపీకి ఓటేసి ఒక్క ఛాన్స ఇవ్వడంతో రాష్ట్రం అధోగతి పట్టిందని, మళ్లీ వైసీపీకి ఓటేస్తే సర్వనాశనం అవుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. టీడీపీ సంక్షేమం, అభివృద్ధి జరిగాయన్నారు. ఆమె ఆదివారం మండలంలోని గొందిపల్లి, దుద్దేబండ, చంద్రగిరి, గొల్లపల్లి, గోనిపేట, రాంపురం, గ్రామాల్లో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాల్లో గజమాలలు, పూలు, హారతులతో మహిళలు ఆమెను ఆశీర్వదించారు. ఆమె టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... ఐదేళ్ల జగన అసమర్థ పాలనతో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. విదేశాల నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలన్నా జగన వైఖరితో భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. కియ పరిశ్రమ రాకతో వేల మంది ఉద్యోగాలు పొందుతున్నారని, గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంతో ఈ ప్రాంతంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉన్నాయన్నారు. ఇవి చంద్రబాబు చలువేనన్నారు.


పరిశ్రమ రాకతో ఇక్కడి ప్రజల జీవన విధానం మారిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ సిద్దయ్య, గుట్టూరు చిన్నవెంకట రాముడు, జిల్లా అధికార ప్రతినిధి రఘువీరా, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, సర్పంచ శ్రీనివాసులు, సూర్యనారాయణరెడ్డి, పోతిరెడ్డి, బాబుల్‌రెడ్డి, బోయ రామక్రిష్ణ, గుట్టూరు సూరి, రాజు, విశ్వనాథ్‌, నరేంద్రరెడ్డి, హరీష్‌రెడ్డి, వెంకటేశరెడ్డి, రంగారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.


పెనుకొండ టౌన : మైనార్టీల రక్షణ, సంక్షేమం టీడీపీతోనే అని, జగన మైనార్టీలను మోసం చేశాడని ఎమ్మె ల్యే అభ్యర్థి సవిత అన్నా రు. ఆమె ఆదివారం ప ట్టణ సమీపంలోని దర్గా పేట ప్రాంతంలో ఎన్నిక ల ప్రచారం నిర్వహిం చారు. మైనార్టీ నాయ కుడు దాదు, జఫ్రుల్లా ఖాన, సనావుల్లా తది తరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2024 | 12:08 AM