Share News

CRISIS : ‘పురం’లో నీటికి కటకట

ABN , Publish Date - May 16 , 2024 | 12:10 AM

వేసవి ముగుస్తోంది. హిందూపురంలో మాత్ర నీటి సమస్య తీరలేదు. పట్టణ వ్యాప్తంగా మునిసిపాలిటీ సరఫరా చేసే నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌ ట్యాంకర్లతో నీటిని కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే అకాశాన్నంటే నిత్యవసరాల ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. దీనికి తోడు తాగునీటి కోసం నెలకు రూ.1500 అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. దీంతో కుటుంబం ఖర్చు మరింత పెరిగి తీవ్ర ఇబ్బందు లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CRISIS : ‘పురం’లో నీటికి కటకట
Catching water from a purchased tanker

15 రోజులుగా సరఫరా కాని మునిసిపల్‌ నీరు

ప్రైవేటు ట్యాంకర్లతో కొనుక్కొంటున్న ప్రజలు

నెలకు రూ.1500 అదనపు ఖర్చు

హిందూపురం అర్బన, మే 15: వేసవి ముగుస్తోంది. హిందూపురంలో మాత్ర నీటి సమస్య తీరలేదు. పట్టణ వ్యాప్తంగా మునిసిపాలిటీ సరఫరా చేసే నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌ ట్యాంకర్లతో నీటిని కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే అకాశాన్నంటే నిత్యవసరాల ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. దీనికి తోడు తాగునీటి కోసం నెలకు రూ.1500 అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. దీంతో కుటుంబం ఖర్చు మరింత పెరిగి తీవ్ర ఇబ్బందు లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వేసవి కాలం వచ్చిందంటే హిందూపురంలో నీటి ఎద్దడి ఎక్కువగా కనిపించేది. కానీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవతో రూ.194 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన ద్వారా నీటిని సరఫరా చేయడంతో ఆ సమస్య కనుమరుగైంది అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ పట్టణంలో నీటి సమస్య అధికమైంది. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు సక్రమంగా సరఫరా అయితే టీడీపీకి, బాలకృష్ణకు పేరు వస్తుందనే భావనతో పైపులు మరమ్మతులకు వచ్చినా, విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడినా వైసీపీ పాలకులు సరిగా స్పందించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి


. దీంతో పాటు కొంతమంది మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వల్ల పట్టణంలో నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉందన్న విమర్శలూ లేకపోలేదు. ముఖ్యంగా పలువురు ఫిట్టర్లు, వాటర్‌మనలు నిర్వాకం వల్ల నీటి సరఫరా విభాగంలో పెద్ద ఎత్తున అక్రమ కనెక్షనల వ్యవహారం నడుస్తోందని మునిసిపల్‌ శాఖలోని కొంత మంది చర్చించుకోవడం విశేషం. కొన్ని అపార్టుమెంట్‌లకు, హోటళ్లకు అధికంగా నీరు సరఫరా ఏర్పాట్లు ఉండడంతో ప్రజలకు నీరు సక్రమంగా అందడం లేదనే విమర్శలు బహిరంగంగా వినిపి స్తున్నాయి. అంతే కాకుండా పలువురు కౌన్సిలర్లు జులుం ప్రదర్శించడం వల్ల అక్రమ కనెక్షనలు విచ్చల విడిగా వెలిసిన ట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి పన్నులు సక్రమంగా చెల్లించే వారు ఇబ్బందులు పడుతు న్నారు. పట్టణంలో వారానికి కనీసం రెండు సార్లు నీరు అందించాల్సి ఉంది. కానీ గొల్లపల్లి నుంచి నీరు సరఫరా కావడం లేదనే నెపంతో ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో అవస రానికి నీరు కొనాల్సి వస్తోంది. ఇప్పుడు పట్టణంలో 15 రోజులుగా నీటి సరపరా నిలిచిపోయి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మునిసిపల్‌ నీటి సరఫరా సిబ్బందిని అడిగితే గొల్లపల్లి రిజర్వియర్‌ వద్ద విద్యుత బోర్డులో మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు ఇంకా వారం రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. దీంతో ప్రైవేటు ట్యాంకర్లపై ఆధార పడక తప్పదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత సరఫరాలో సమస్య ఉంది- బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్‌ డీఈ

గొల్లపల్లి రిజర్వాయర్‌లో నీటి సరఫరా ఆగింది. అక్కడ విద్యుత సరఫరాలో మరమ్మతుల కారణంగా హిందూపురానికి నీరు అందించలేకపోతున్నాం. మూ డు రోజుల నుంచి సిబ్బంది అన్ని విధాలా ప్రయత్నాలు చేశారు. కానీ మర మ్మ తులు కావడం లేదు. బుధవారం విద్యుతశాఖ అధికారులను కూడా పిలిచాం. వారి సహకారంతో మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇంకా మూడు రోజులు సమయం పట్టవచ్చు.

నీటి సరఫరాకు రెండు రోజులు అంతరాయం - మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత

హిందూపురం పట్టణ ప్రాంతంలో మునిసిపల్‌ నీరు అందించే విషయంలో అంతరాయం ఏర్పడినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ ఎస్‌కేడీ వాటర్‌ లిఫ్టింగ్‌ వద్ద ట్రాన్సఫార్మర్‌, ఫ్యానల్‌ బోర్డులో మరమ్మతుల కారణంగా రెండు రోజుల పా టు నీటి సరఫ రాకు అంతరాయం కలుగవచ్చన్నారు. ఇప్పటికే మునిసపల్‌ సిబ్బంది, విద్యుత శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారన్నారు. వాటిని సరిచేసేందుకు రెండు రోజల సమయం పడుతుందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - May 16 , 2024 | 12:10 AM