Ultrasound scanning machines : ఏం ప్రయోజనం!
ABN , Publish Date - Jul 14 , 2024 | 11:47 PM
జిల్లాలో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అలా్ట్రసౌండ్ స్కానింగ్ యంత్రాలు వచ్చాయి. జిల్లాలోని తరిమెల, కంబదూరు, బెళుగుప్ప, పెద్దవడుగూరు, ఎద్దులపల్లి, వజ్రకరూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ఈ యంత్రాలను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పీహెచసీలకు అధునాతన యంత్రాలు రావడంతో మహిళలు, గర్భిణులు, ఇతర ప్రజలు స్కానింగ్ చేయించుకోవడానికి వేరే ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవస్థ తప్పింది. ఒక్కో ...
ఆరు పీహెచసీలకు అలా్ట్రసౌండ్ స్కానింగ్ యంత్రాలు
అక్కడ గైనకాలజిస్టులు, రేడియాలజీ టెక్నీషియన్లు లేరు
కేటాయింపునకు సతమతమవుతున్న వైద్యాధికారులు
అనంతపురం టౌన, జూలై 14:
జిల్లాలో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అలా్ట్రసౌండ్ స్కానింగ్ యంత్రాలు వచ్చాయి. జిల్లాలోని తరిమెల, కంబదూరు, బెళుగుప్ప, పెద్దవడుగూరు, ఎద్దులపల్లి, వజ్రకరూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ఈ యంత్రాలను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పీహెచసీలకు అధునాతన యంత్రాలు రావడంతో మహిళలు, గర్భిణులు, ఇతర ప్రజలు స్కానింగ్ చేయించుకోవడానికి వేరే ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవస్థ తప్పింది. ఒక్కో యంత్రానికి దాదాపు రూ.10లక్షలు వెచ్చించి ఈ ఆస్పత్రులకు పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఆసుపత్రుల లో గైనకాలజి్‌స్టలు లేరు. దీంతో అలా్ట్రసౌండ్ స్కానింగ్ యంత్రాలు ఎలా వాడుకోవాలోననే సందిగ్ధంలో వైద్యశాఖ అధికారులు పడ్డారు. దీంతో తమకు మెరుగైన వైద్య సేవలు అందుతాయో లేదోననే ఆందోళన గ్రామీణ ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
సీహెచసీల నుంచి పంపాలని వినతి
వైద్యవిధాన పరిషత పరిధిలో నడుస్తున్న సీహెచసీల నుంచి గైనకాలజి్‌స్టలను ఈ పీహెచసీలకు పంపాలని సంబంధిత డీసీహెచఎ్‌సకు జిల్లా వైద్యాధికారి విన్నవించారు. ఈమేరకు నెల రోజులు కిందటే విజ్ఞప్తి చేసినా అక్కడి నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదు. సీహెచసీలకు రోగులు, గర్భిణులు అత్యధికంగా నే వస్తుంటారు. దీంతో ఇక్కడే పని ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడకు ఎలా వెళ్లేదని సీహెచసీలలో పనిచేస్తున్న గైనకాలజి్‌స్టలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వ్యవహారం ఇలా ఉండటంతో స్కానింగ్ యంత్రాలు వచ్చినా ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుందనే వాదన వినిపిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.
డాక్టర్లను పంపాలని డీఎంహెచఓ అడిగారు
అలా్ట్రసౌండ్‌స్కానింగ్ యంత్రాలు వచ్చిన పీహెచసీలకు గైనకాలజి్‌స్టలను పంపించాలని డీఎంహెచఓ అడిగారు. ఈవిషయంపై మా సీహెచసీ డాక్టర్లలో మాట్లాడుతున్నాం. ఇక్కడే పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈక్రమంలో అక్కడికి ఎలా వెళ్లేదని వారు ప్రశ్నిస్తున్నారు. చివరకు వారానికి ఓ రోజైన ఆ పీహెచసీలకు వెళ్లమని చెబుతున్నా, త్వరలో ఈసమస్య పరిష్కారం అవుతుంది. - డాక్టర్ రవికుమార్ (డీసీహెచఎస్)
వారానికి ఓరోజు అలా్ట్రసౌండ్ సేవలందిస్తాం
ఆరు పీహెచసీలకు అలా్ట్రసౌండ్ స్కానింగ్ యంత్రాలు వచ్చిన విషయం వాస్తవమే. అయితే ఆ యంత్రాలు నిర్వహించాలంటే రేడియాలజీ టెక్నీషియన్లు, గైనకాలజి్‌స్టలు ఉండాలి. ప్రస్తుతం ఆ పీహెచసీలలో అలాంటి సిబ్బంది ఎవరూ లేరు. అందుకే ప్రస్తుతం రేడియాలజీ టెక్నీషియన్లను సర్దుబాటు చేస్తున్నాం. సీహెచసీలలో ఉన్న గైనకాలజి్‌స్టలను ఇక్కడకు పంపమని డీసీహెచఎ్‌సను కోరాం. వారానికి ఓరోజు పంపిస్తామంటున్నారు. ఆప్రకారం వారంలో ఒకరోజు స్కానింగ్ అవసరమైన వారిని రమ్మని సేవలు అందేలా చూస్తాం.
- డాక్టర్ ఈబీ దేవి, డీఎంహెచఓ
మరిన్ని అనంతపురం వార్తల కోసం....