SAVITA: ఎక్కడ చూసినా టీడీపీ అభివృద్ధే...
ABN , Publish Date - May 04 , 2024 | 12:06 AM
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన అభి వృద్ధి మాత్రమే గ్రామాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తోందని, వైసీపీ పా లనలో జరిగిన అభివృధ్ధి శూన్యమని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత అన్నారు. గోరంట్ల మండలంలోని బూదిలి పంచాయతీ గ్రామాల్లో శుక్ర వారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన ఎ న్నికల మేనిఫెస్టో పట్ల, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, అడుగడగున తమకు అండగా నిలుస్తున్నారని అన్నారు. మహిళలు సైతం ఉత్సహం చూపుతూ ముందుకు సాగుతున్నారన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి సవిత
గోరంట్ల, మే 3: గతంలో టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన అభి వృద్ధి మాత్రమే గ్రామాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తోందని, వైసీపీ పా లనలో జరిగిన అభివృధ్ధి శూన్యమని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత అన్నారు. గోరంట్ల మండలంలోని బూదిలి పంచాయతీ గ్రామాల్లో శుక్ర వారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన ఎ న్నికల మేనిఫెస్టో పట్ల, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, అడుగడగున తమకు అండగా నిలుస్తున్నారని అన్నారు. మహిళలు సైతం ఉత్సహం చూపుతూ ముందుకు సాగుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమపథకాలను వివరించారు.
గ్రామాల అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథిని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్వీనర్ సోముశేఖర్, నిమ్మల యువశేఖర్, అశ్వర్థరెడ్డి, బాలక్రిష్ణ, రవి, తదితరులు, జనసేన, బిజెపీ నాయకులు, కార్యకర్తలున్నారు.
దోచుకెళ్లడానికే వస్తున్నారు
పెనుకొండ టౌన: గుడ్‌మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యే శంకర్ నారాయణ పెనుకొండలో కలియతిరిగి, అభివృద్ధి చేస్తానని నమ్మ బలి కారని ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. అయితే ఇక్కడ దోచుకుని నేడు పెనుకొండ ప్రజలకు బ్యాడ్‌మార్నింగ్ చెప్పి మరోచోటికి బదిలీ అయ్యారని విమర్శించారు. అదే తరహాలో దోచుకుని వెళ్లేందు కు ప్రస్తుతం మరో ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ వచ్చారన్నారు. సవి త శుక్రవారం పట్టణంలోని దర్గాపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పెనుకొండలో ఎక్కడ చూసినా టీడీపీ హ యాంలో చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. గతంలో ఎక్కడ చూసినా ఎల్‌ఈడీ బల్బులు వెలిగించామని, అవి పోతే మా ర్చలేని పరిస్థితులు వైసీపీ పాలనలో ఉన్నాయన్నారు. మైనా ర్టీలకు టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. టీడీపీ హయాంలో రంజాన తోఫా అందిస్తే వైసీపీ నిలిపివేసింద న్నారు. దీంతో తాము స్వచ్ఛందంగా నాలుగేళ్ల పాటు రెండు వే ల మందికి రంజాన తోఫా అందించామన్నా రు. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్దిచెప్పాలని కోరారు. మైనార్టీ నాయకు లు దాదు, అత్తర్‌ఖాదిర్, జఫ్రుల్లా, షౌకత, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, హుజురుల్లాఖాన, హరీ, బాబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలోకి పలువురి చేరిక
పెనుకొండ టౌన/ రొద్దం : వైసీపీ మైనార్టీ జిల్లా కార్యదర్శి రొద్దం మండలానికి చెందిన వజీర్‌బాష శుక్రవారం టీడీపీలో చేరారు. ఆయన తో పాటు నియోజకవర్గానికి చెందిన 60కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే అభ్యర్థి సవిత వారికి పెనుకొండలోని పార్టీ కార్యాలయంలో కండువాలు వేసి ఆహ్వానించారు. రొద్దం మండలం కోగిర, పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లి, రాంపురం పంచాయతీ, గోరంట్ల మం డలం సింగిరెడ్డిపల్లి, పరిగి మండలం గంగిరెడ్డిపల్లి, గోనిపల్లి, సోమందే పల్లి మండలం చాలకూరు నుంచి పార్టీలో చేరారు. గోరంట్ల మండలా నికి చెందిన గణేష్, బాబు, సూరి, నాగభూషణం, అశ్వత్థ, వేణు, శంకర్, భాస్కర్, పరిగి మండలం శీగుపల్లికి చెందిన రామాంజనేయులు, అశ్వ త్థప్ప, రామాంజినప్ప, అనిల్, అజయ్, రాము, రమేష్, నరసింహులు, సోమందేపల్లి మండలం శంకరప్ప, చిరంజీవి, నరసింహమూర్తి, నవీన, ముత్యాలప్ప తదితరులు పార్టీలో చేరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....