water problem: నీటి సమస్య తీర్చాలని ఆందోళన
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:54 PM
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 25: మండలంలోని కొట్లపల్లి బీసీ కాలనీలో నీటి సమస్యను పరిస్కరించాలంటూ స్థానిక మహిళలు గురువారం గ్రామసచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాలనీకి చెందిన రాములమ్మ, లక్ష్మమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నాగిరెడ్డి, రామయ్య, బేల్దారి రామాంజి తదితరులు ఖాళీ బిందెలతో గ్రామసచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కొట్లపల్లి, సురగానిపల్లి గ్రామాలకు సంబంధించి మూడుబోర్లు ఉండగా అందులో ఒకటి మరమ్మతుకు గురైందన్నారు.

మిగతా రెండు బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో ఎగువ ప్రాంతమైన బీసీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. దీంతో చేసేదిలేక వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. గతేడాది అంగన్వాడీ భవనం వద్ద బోరు వేశారని, వీటిలో నీరు సమృద్దిగా ఉన్నా సంబంధిత అధికారులు పైపులైన వేసి ఉపయోగించ లేదని వారు మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని, గేట్‌వాల్వులు ఏర్పాటు చేసి ఎగువ ప్రాంతాలకు నీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తామని సచివాలయ సిబ్బంది తెలపడంతో వారు ఆందోళన విరమించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....