Share News

SAVITA : ఓటమిభయంతోనే వైసీపీ అరాచకాలు

ABN , Publish Date - May 08 , 2024 | 12:13 AM

ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని, పెను కొండలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సందర్భంగా వారు అనుసరించిన విధానమే అందుకు నిదర్శనమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. ఆమె మంగళవారం మండలంలోని గుట్టూరు, వెంకటగిరిపా ళ్యంలో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా సవితకు పూల వర్షం కురిపించారు.

SAVITA : ఓటమిభయంతోనే వైసీపీ అరాచకాలు
Savita speaking in the industry

ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి సవిత

పెనుకొండ, మే 7: ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని, పెను కొండలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సందర్భంగా వారు అనుసరించిన విధానమే అందుకు నిదర్శనమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. ఆమె మంగళవారం మండలంలోని గుట్టూరు, వెంకటగిరిపా ళ్యంలో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా సవితకు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... వైసీపీ ఐదేళ్లపాలనలో గ్రామాల్లో ఏ ఒక్క అభి వృద్ధి జరగలేదన్నారు. కియ పరిశ్రమ రాకతో ఇక్కడి గ్రామాల్లో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించా యన్నారు.


ఇంకా అలాంటి పరిశ్రమలు తెప్పించడం చంద్రబాబుతో సాధ్యమన్నారు. రాష్ట్రం బాగు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ టీసీ నారాయణస్వామి, మాజీ ఎంపీపీ కేశవయ్య, గు ట్టూరు చిన్నవెంకటరాముడు, మండల కన్వీనర్‌ సిద్ద య్య, గుట్టూరు సూరి, శ్రీరాములు యాదవ్‌, నాయకులు రఘువీరచౌదరి, వీజీపాళ్యం శీన, కోనాపురం రామలింగ, పోతిరెడ్డి, బాబుల్‌రెడ్డి, గొందిపల్లి సూరి, మల్లికార్జున, బోయ నాగరాజు, సుబ్బరాయుడు, తుపాకుల రవి, వడ్డి వెంకటేశ, హనుమంతు, రమే్‌షనాయుడు, తెలుగు యువత మల్లి తదితరులు పాల్గొన్నారు.


టీడీపీతోనే మహిళలకు ఉపాధి, భద్రత

గోరంట్ల: యువతకు ఉపాధి అవకాశాలు, లభించాలన్నా, మహిళలతకు భద్ర కావాలన్నా టీడీపీ తోనే సాధ్యమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె మంగళవారం గోరంట్ల మండలం లోని బూదిలి గ్రామం వద్ద శ్యాండిల్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్న యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... అభివృద్దికి చిరునామా కియ పరిశ్రమ అన్నారు. అవినీతికి కేరాఫ్‌ లేపాక్షి హబ్‌ నాలెడ్జ్‌ భూములన్నారు. నిరుద్యోగ నిర్మూ లన, మహిళ సాధికారిత, భద్రత చంద్రబాబు పాలన లోనే లభిస్తాయన్నారు. సీఎం జగన పాలనలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కోసం సే కరించిన భూములు ఇటు రైతులకు, అటు పరిశ్రమలకు కాకుండా పోయిన విషయాన్ని వివరించారు.


టీడీపీ సూపర్‌ సిక్స్‌పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. మహి ళలకు ప్రతినెల రూ. 1500, యేడాదికి మూడు ఉచిత సిలిండర్లు, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం లభిస్తుందని వివరించారు. రాష్ట్రానికి విరివిగా పరిశ్ర మలు రావాలన్నా, యువత బాగుపడాలన్నా, రాష్ట్ర భవిష్యత కోసం సైకిల్‌ గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఈ ప్రాంతం మరో నాలుగు తరాలు గుర్తుండేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పార్థసారఽథిని అత్యధిక మెజార్టీతో గెలి పించాలని కోరారు. ఈ సందర్భంగా గోరంట్లకు చెందిన వైసీపీ నాయకుడు స్థానిక హోటల్‌ యజమాని ఆదినారాయణ ఆధ్వర్యంలో 15కుటుంబాలు టీడీపీలో చేరాయి. సవిత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 08 , 2024 | 12:14 AM