SAVITA : వైసీపీ పాలనకు నూకలు చెల్లాయ్..
ABN , Publish Date - May 03 , 2024 | 01:25 AM
ఐదేళ్లకాలం నుంచి గ్రామాల్లో అభివృద్ధి చేయక ప్రకృతి సంపదను దోచేసిన వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే కాలం దగ్గరపడిందని టీ డీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. ఆమె గురువారం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథితో కలిసి మండల పరిధిలోని బొక్సంపల్లి, శ్యాపురం, కం బా లపల్లి, బీదానిపల్లి, కనుమర, నారనాగేపల్లి, నాగిరె డ్డిపల్లి, రాచూరు, జక్కలచెరువు, కుర్లపల్లి, కందుకూర్ల పల్లి, చిన్నకోడిపల్లిల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ కళ్యాణదుర్గంలోని ఇసుకను దోచుకుని పెనుకొండకు వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్ వద్ద అక్రమంగా సంపాదించిన డబ్బుంటే తమవద్ద ప్రజాబలం ఉందన్నారు.
రోడ్‌షోలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత
రొద్దం, మే 2 : ఐదేళ్లకాలం నుంచి గ్రామాల్లో అభివృద్ధి చేయక ప్రకృతి సంపదను దోచేసిన వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే కాలం దగ్గరపడిందని టీ డీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. ఆమె గురువారం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథితో కలిసి మండల పరిధిలోని బొక్సంపల్లి, శ్యాపురం, కం బా లపల్లి, బీదానిపల్లి, కనుమర, నారనాగేపల్లి, నాగిరె డ్డిపల్లి, రాచూరు, జక్కలచెరువు, కుర్లపల్లి, కందుకూర్ల పల్లి, చిన్నకోడిపల్లిల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ కళ్యాణదుర్గంలోని ఇసుకను దోచుకుని పెనుకొండకు వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్ వద్ద అక్రమంగా సంపాదించిన డబ్బుంటే తమవద్ద ప్రజాబలం ఉందన్నారు.
ఆ మె ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ డబ్బంతా ప్రజ ల సొమ్మే అన్నారు. ఆ డబ్బు తీసుకుని టీడీపీకి ఓటే యాలని ప్రజలను కోరారు. మోసపోయి ఆమెకు ఓటేస్తే ఈ ప్రాంతంలోని ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తుందన్నారు. తమ తండ్రి రామచంద్రారచెడ్డి కా లం నుంచి పరిటాల రవి, సునీత, బీకే పార్థ సారథి వరకు చేసిన అభివృద్ధి పనులే గ్రామాల్లో కనిపిస్తున్నా యన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉ మ్మడి మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాలకు చంద్రబాబు న్యాయం చేస్తారన్నా రు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవ నాయుడు, సుబ్బరత్నమ్మ, చిన్నప్పయ్య, చంద్ర మౌళి, నరసింహులు, నరహరి, హరీష్, కంబాలపల్లి సర్పంచ మంజు, క్లస్టర్ ఇనచార్జ్ నాగేంద్ర, మనోహర్, నాగభూషణం, వాల్మీకి చంద్ర శేఖర్, వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలోకి పలువురి చేరిక
పెనుకొండ టౌన: టీడీపీ స్థానిక కార్యాలయంలో గురువారం పలువురు టీడీపీలో చేరారు. వారికి సవిత కండు వాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంత రం ఆమె మాట్లాడుతూ... గత టీడీపీ హయాంలో అప్ప టి ముఖ్యమంత్రి చంద్రబాబు గొల్లపల్లి రిజర్వాయర్‌ను త్వరితగతిన పూర్తిచేసి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 30చెరువులకు నీరందించారని తెలిపారు. అయితే కాలువలు వెడల్పుచేసి గోరంట్ల మండలంలోని 93 చెరువులకు నీరందిస్తామని ఎమ్మెల్యే శంకర్ నారాయణ ప్రగల్బాలకే పరిమితమయ్యాడని, ఇప్పుడు ఇతర ప్రాంతానికి బదిలీ అయ్యాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీదానిపల్లి సర్పంచ మంజునాథ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల: మండలంలోని బూచేపల్లి, కొత్తపల్లి, పుట్టగుండ్లపల్లి, కొత్తపల్లితండా, ఎర్రబల్లికి గ్రామాల కు చెందిన 45కుటుంబాలు వైసీపీనుంచి గురువారం టీడీపీలో చేరారు. బీ కొత్తపల్లికి చెందిన గట్టు సూర్య ప్రకాష్‌రెడ్డి, నరసింహారెడ్డి, పుట్టగుండ్లపల్లి వార్డు సభ్యులు సోమప్ప, రాము, ప్రకాష్, వలంటీర్లు కమ లాకర్, సురేష్, కొత్తపల్లి తండాకు చెందిన పలువురు గిరిజనులు టీడీపీలో చేరారు. గోరంట్లలోని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప నివాసం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....