Share News

ఇమామ్‌, మౌజన్లకు గౌరవ వేతనం

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:43 AM

Andhra Government Announces Rs. 10,000 for Imams and Rs. 5,000 for Moujins as Honorarium

ఇమామ్‌, మౌజన్లకు గౌరవ వేతనం

ఉత్తర్వులు జారీ.. మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి ఫరూక్‌

అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 5 వేల ఆదాయంలేని మసీదుల ఇమామ్‌లు, మౌజన్లకు కూటమి సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని రూ.10వేలు, మౌజన్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల చొప్పున కొనసాగిస్తూ గురువారం ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ గౌరవ వేతనం వర్తిస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.90 కోట్లు వెచ్చిస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అడుగడుగునా విఘాతం కల్పించి, గాలికి వదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల పనితీరుపై మంత్రి సమీక్ష

రాష్ట్రంలోని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు, ప్రత్యేక కోర్టుల పనితీరుపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ గురువారం అమరావతి సచివాలయంలో సమీక్షించారు. న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవితో పలు అంశాలపై చర్చించారు.

Updated Date - Dec 20 , 2024 | 05:43 AM