Share News

Breaking News: అసెంబ్లీ సమావేశాలు..

ABN , First Publish Date - Nov 21 , 2024 | 10:45 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

 Breaking News: అసెంబ్లీ సమావేశాలు..
Breaking News

Live News & Update

  • 2024-11-21T17:30:39+05:30

    ఏపీ శాసనసభ రేపటికి వాయిదా..

    • అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

    • నేటి సమావేశాల్లో ఆరు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు.

    • ఏపీ మున్సిపల్ లా రెండో సవరణ బిల్లుకు ఆమోదం.

    • ఏపీ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ సవరణ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్.

    • ఏపీ వ్యాల్యూ యాడెడ్ సవరణ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ.

    • ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్.. ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ సవరణ బిల్లుకు ఆమోదం.

    • ఏపీ ల్యాండ్ గ్రాబింగ్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.

  • 2024-11-21T16:48:48+05:30

    జనసేనకు పీఏసీ చైర్మన్ పదవి..

    • పీఏసీ చైర్మన్‌ పదవిని జనసేనకు కేటాయించిన టీడీపీ

    • భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరును..

    • పీఏసీ చైర్మన్‌ పదవికి ఎంపిక చేసిన పవన్‌ కల్యాణ్‌

    • రేపు అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యుల ఎన్నిక

    • వైసీపీ తరపున పెద్దిరెడ్డి నామినేషన్‌ వేయడంతో..

    • అనివార్యంగా మారిన పీఏసీ సభ్యుల ఎన్నిక

    • పీఏసీ సభ్యులుగా టీడీపీ నుంచి శ్రీరామరాజు గోపాల్(జగ్గయ్యపేట)..

    • జయనాగేశ్వర్‌రెడ్డి(ఎమ్మిగనూరు), రాధాకృష్ణ(తణుకు)..

    • అశోక్‌రెడ్డి(గిద్దలూరు), రామాంజనేయులు(పత్తిపాడు)

    • నక్కా ఆనందబాబు(వేమూరు), కోళ్ల లలితకుమారి(S.కోట)

    • బీజేపీ నుంచి విష్ణుకుమార్‌రాజు(విశాఖ నార్త్)

    • పీయూసీ చైర్మన్‌గా కూన రవికుమార్‌కు అవకాశం

    • ఎస్టిమేట్స్‌ కమిటీ చైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావుకు అవకాశం

  • 2024-11-21T16:43:22+05:30

    ఏపీ అసెంబ్లీలో ఆరు బిల్లులకు ఆమోదం..

    • ఏపీ మున్సిపల్ లా రెండో సవరణ బిల్లుకు ఆమోదం

    • ఏపీ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ సవరణ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్

    • ఏపీ వ్యాల్యూ యాడెడ్ సవరణ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ

    • ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్..

    • ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ సవరణ బిల్లుకు ఆమోదం

    • ఏపీ ల్యాండ్ గ్రాబింగ్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

  • 2024-11-21T16:33:50+05:30

    అసెంబ్లీలో ఎమ్మెల్యే రవికుమార్ ప్రసంగం వివరాలు..

    • రెవెన్యూ మంత్రి ప్రవేశపెట్టిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్.. కబ్జా చేయాలనే ఆలోచన వచ్చే వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా ఉంది.

    • ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కోర్టు లేదు.

    • ఆ కోర్టును ఎందుకు కంటిన్యూ చేయలేదు.. ఫాస్ట్ ట్రాక్ కోర్డు ద్వారా కాలపరిమితితో కూడి ఏర్పాటు చేయాలి.

  • 2024-11-21T16:32:25+05:30

    భూ దురాక్రమణ నిషేధ బిల్లు-2024ను అసెంబ్లీ ప్రవేశపెట్టిన మంత్రి

    • అమరావతి: ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు-2024 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి అనగాని సత్య ప్రసాద్. ఈ బిల్లుపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు.

    • ఎమ్మెల్యే, గోరెంట్ల బుచ్చియ్య చౌదరి..

    • ఐదు సంవత్సారాల్లో లక్షల కోట్ల ఆస్తులు కబ్జా అయ్యాయి.

    • విశాఖ, చిత్తూరు ఇతర జిల్లాల్లో భయానకంగా అయిపోయింది.

    • నా నియోజకవర్గంలో రూ. 550 కోట్లు విలువైన ఆస్తిని కబ్జా చేశారు.

    • ఐదు సంవత్సరాలు పాటు కలెక్టరేట్‌ను చిల్లర కొట్టుగా మార్చేశారు.

    • కలెక్టర్‌లు, జాయింట్ కలెక్టర్‌లు ఇష్టానుసారం మ్యూటేషన్ చేసేశారు.

    • అక్కడి నుండి వెళ్లిపోయయిన ఎంఆర్ఓ పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు చేశారు.

    • అధికారులు వారి వాటాలు వారు వేసుకొని ఇష్టానుసారం మ్యూటేషన్ చేసుకున్నారు.

    • విదేశాల్లో ఉన్న వారి భూములను కబ్జా పెట్టారు.

    • రికార్డులు తగలేస్తే చర్యలు ఏవి, మదనపల్లిలో, విజయవాడలో ఏం జరిగింది.

    • భయం ఉండాలి ఎవ్వరయినా ఇతరుల భూములు కబ్జా చేయాలంటే భయపడాలి.

  • 2024-11-21T16:23:18+05:30

    ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా..

    • అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రేపటికి వాయిదా పడింది.

  • 2024-11-21T11:38:17+05:30

    కూటమి ప్రభుత్వ నినాదం ఇదే

    • అమరావతి: ఒకే రాష్ట్రం ఓకే రాజధాని అనేది కూటమి ప్రభుత్వ నినాదం

    • అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నాం

    • విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చాం

    • డాటా సెంటర్ పాలసీకి రూపకల్పన చేశాం

    • గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు సంబంధించిన ఒక్క కాన్ఫరెన్సు జరగలేదు

    • వైసీపీ హయాంలో ఐటీ మంత్రి గుడ్డూ-కోడి అంటూ వ్యాఖ్యలు చేశారు.

    • పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ఐటీ మంత్రి ఇలా ఉంటారా అంటూ మాట్లాడారు

    • గత ఐదు నెలల్లో చాలా ఐటీ సంస్థలతో సమావేశాలు నిర్వహించాం: మంత్రి నారా లోకేశ్

  • 2024-11-21T11:32:59+05:30

    మంత్రి అనగాని సత్యప్రసాద్ కామెంట్స్

    • అమరావతి: భూముల రీ సర్వేపై శాసనమండలిలో చర్చ

    • భూ సర్వే పేరుతో వైసీపీ సర్కార్ భూదోపిడీకి పాల్పడింది.

    • రీ సర్వేను అడ్డుపెట్టుకొని సొంతవారికి లబ్ది చేకూర్చారు.

    • భూ సర్వే పేరుతో ప్రత్యర్థులను వేధించారు.

    • పద్ధతి ప్రకారం రీ సర్వే జరగలేదు.

    • ప్రచార యావతో ప్రజలను ఇబ్బందులు పెట్టారు.

    • భూ రీ సర్వే పేరుతో 900 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారు.

    • ఇప్పటికీ 6631 గ్రామ సభలు పెట్టాం. వేలాది ఫిర్యాదులు వచ్చాయి.

    • గ్రామ సభలు పూర్తయ్యక ప్రణాళిక ప్రకారం ప్రజలకు న్యాయం చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

  • 2024-11-21T11:08:20+05:30

    వాయు కాలుష్యంపై మండలిలో పవన్ కల్యాణ్

    • అమరావతి: విశాఖలో వాయు కాలుష్యంపై మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • వైజాగ్‌లో వాయు కాలుష్యం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడే ఉంది

    • ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు

    • వాయి కాలుష్యంపై ఏఎన్‌యూను నివేదిక కోరాం.

    • నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం.

    • గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.121 కోట్లు కేటాయించింది.

    • వైసీపీ సర్కార్ కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

  • 2024-11-21T10:57:08+05:30

    మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్స్

    • అమ‌రావ‌తి: పుష్కర ఎత్తిపోత‌ల ప‌థకంలో తాళ్లూరు లిప్ట్ పైపులు లీకేజీ

    • లిప్ట్ స్కీమ్ నిర్వహణ, మోటార్ల మ‌ర‌మ్మతులకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం

    • గత ప్రభుత్వం ఎత్తిపోత‌ల‌ను నిర్వీర్యం చేసింది.

    • జ‌గ‌న్ హాయాంలో 1040 లిప్ట్ స్కీముల్లో 450 మూత‌ప‌డ్డాయి.

    • లిప్ట్ స్కీమ్ ప‌ని చేయక బీడుబడ్డ 4 లక్షల ఎక‌రాలు

    • తాళ్ళూరు లిప్ట్ మాత్రమే కాదు.. శిథిలావస్తలో రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు

    • తాళ్ళూరు లిప్ట్‌కు సంబందించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచ‌నాలు

  • 2024-11-21T10:50:06+05:30

    పీఏసీ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ

    • అమరావతి: పీఏసీ చైర్మన్ ఎన్నికపై అసెంబ్లీలో ఉత్కంఠ

    • పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్..?

    • నామినేషన్ వేయనున్న సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి.

    • ప్రతిపక్ష పార్టీకే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలంటోన్న వైసీపీ.

    • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి లేని ప్రతిపక్ష హోదా

  • 2024-11-21T10:49:27+05:30

    • వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

    • అమరావతి: వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.

    • వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ

    • వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ

  • 2024-11-21T10:45:13+05:30

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.