-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh Budget 2024-25 Assembly Session Live Updates in Telugu News Breaking News
-
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్ ఎంతో తెలుసా..
ABN , First Publish Date - Nov 11 , 2024 | 10:48 AM
Andhra Pradesh Assembly Budget Session Live Updates: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయమే 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ పూర్తి వివరాలు లైవ్‌లో మీకోసం..
Live News & Update
-
2024-11-11T13:09:33+05:30
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా వేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
-
2024-11-11T12:55:55+05:30
మంత్రి అచ్చెన్న..
జలవనరులను పెంచేందుకు ఎన్డీయే సర్కార్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది: మంత్రి అచ్చెన్న
ఏపీలో 15.35 లక్షల బోరు బావులు, 11,032 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి: మంత్రి అచ్చెన్న
59,176 చెక్ డ్యామ్‌లు, 61,834 పెర్క్యూలేషన్ ట్యాంకులు ఉన్నాయి: మంత్రి అచ్చెన్న
ఇప్పటివరకూ 106.12 లక్షల ఎకరాల్లో ఆయకట్టు అభివృద్ధి చేయబడింది: మంత్రి అచ్చెన్న
మత్స్యరంగం అభివృద్ధికి రూ.521.34 కోట్లు కేటాయించాం: మంత్రి అచ్చెన్న
2024-25 వ్యవసాయ బడ్జెట్‌ను సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను: మంత్రి అచ్చెన్న
-
2024-11-11T12:41:28+05:30
ఏపీ ప్రభుత్వం వరాల జల్లు: మంత్రి అచ్చెన్న
ఉద్యాన యూనివర్శిటీ కోసం రూ.102.22 కోట్లు కేటాయించాం: మంత్రి అచ్చెన్న
వ్యవసాయ పశు విశ్వవిద్యాలయానికి రూ.171.72 కోట్లు కేటాయించాం: మంత్రి అచ్చెన్న
ఫిషరీస్ యూనివర్శిటీ కోసం రూ.38 కోట్లు కేటాయించాం: మంత్రి అచ్చెన్న
పశు సంవర్థక శాఖకు రూ.1,095.71 కోట్లు కేటాయించాం: మంత్రి అచ్చెన్న
ఈ బడ్జెట్‌లో రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు: మంత్రి అచ్చెన్న
భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు కేటాయించాం: మంత్రి అచ్చెన్న
ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు కేటాయించాం: మంత్రి అచ్చెన్న
పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు: మంత్రి అచ్చెన్న
-
2024-11-11T12:32:37+05:30
అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న..
ప్రకృతి విపత్తుల వల్ల రైతన్నలపై ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది: మంత్రి అచ్చెన్న
పంటల బీమా అనేది ఇలాంటి విపత్తుల నుంచి రైతులను కాపాడుతుంది: మంత్రి అచ్చెన్న
రైతు సేవా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అనేక సేవలు అందిస్తున్నాం: మంత్రి అచ్చెన్న
పీఏసీఎస్ ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్న
రాయితీపై రైతులకు పనిముట్లు, విత్తనాలు పంపిణీ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్న
-
2024-11-11T12:21:06+05:30
అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న..
ప్రకృతి విపత్తుల వల్ల వ్యవసాయ రంగ నష్టాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టాం: మంత్రి అచ్చెన్న
విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను గుర్తించేందుకు ఈ-పంట యాప్ తీసుకువచ్చాం: మంత్రి అచ్చెన్న
అలాగే రియల్ టైమ్ డేటా సేకరించేందుకు ఈ-పంట యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: మంత్రి అచ్చెన్న
2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు, వరదలకు రైతులు బాగా నష్టపోయారు: మంత్రి అచ్చెన్న
వారిని ఆదుకునేందుకు పరిహార సాయాన్ని పెంచుతూ జీవో 13 జారీ చేశాం: మంత్రి అచ్చెన్న
-
2024-11-11T11:44:01+05:30
అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు..
రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో బాధ్యతను గాలికి వదిలేశారు: మంత్రి అచ్చెన్న
గతేడాది కరవు ప్రాంతాల్లో పంటల బీమా అందించాలనే విచక్షణ వైసీపీ మరిచింది: మంత్రి అచ్చెన్న
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతు అభ్యున్నతే లక్ష్యంగా భావించింది: మంత్రి అచ్చెన్న
అందుకే వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక చర్యలు చేపట్టింది: మంత్రి అచ్చెన్న
భూసార పరీక్షా పత్రాల జారీ, పొలం పిలుస్తోంది కార్యక్రమాలు చేపట్టాం: మంత్రి అచ్చెన్న
వ్యవసాయంలో డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన, శిక్షణ కల్పిస్తున్నాం: మంత్రి అచ్చెన్న
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం: మంత్రి అచ్చెన్న
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ సాయం పెంచాం: మంత్రి అచ్చెన్న
ఆ రైతులకు నెల రోజుల్లోనే నగదు చెల్లించేందుకు కంటి మీద కునుకు లేకుండా పని చేశాం: మంత్రి అచ్చెన్న
-
2024-11-11T11:28:44+05:30
రైతు కుటుంబాల్లో సంతోషం నింపాలంటే నిర్దిష్ట ప్రణాళికలు అవసరం: అచ్చెన్న
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి అగ్ర తాంబూలం: మంత్రి అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది: మంత్రి అచ్చెన్న
ఏపీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై 62 శాతం మంది ప్రజలు ఆధారపడ్డారు: మంత్రి అచ్చెన్న
గత ఐదేళ్లపాటు భూసార పరీక్షలను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది: మంత్రి అచ్చెన్న
గత ప్రభుత్వం రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించలేదు: మంత్రి అచ్చెన్న
వైసీపీ హయాంలో రబీ కాలంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు: మంత్రి అచ్చెన్న
-
2024-11-11T11:23:03+05:30
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు..
అమరావతి: రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక: అచ్చెన్న
రైతు అభ్యున్నతే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: అచ్చెన్న
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ: అచ్చెన్న
వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: అచ్చెన్న
రైతులకు పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా: అచ్చెన్న
భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం: మంత్రి అచ్నెన్న
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం..
వ్యవసాయ రంగానికి నిర్ధిష్ట ప్రణాళిక అవసరం: అచ్చెన్న
2047 టార్గెట్‌తో మా ప్రభుత్వం ముందుకెళ్తోంది: అచ్చెన్న
-
2024-11-11T11:18:00+05:30
ఏపీ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..
ప్రముఖ కవి గుర్రం జాషువా రైతు గురించి రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నా.
రైతుల పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు.
ఆరుగాలం ఇంటిల్లిపాదీ శ్రమించి ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మనసా, వాచా, కర్మనా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నా.
అంధకారం అనే అగాధంలో పడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించేందుకు దార్శనీకత కలిగిన నాయకుడు కావాలనే ప్రజలు చంద్రబాబును గెలిపించారు.
-
2024-11-11T11:04:25+05:30
ఏపీ వార్షిక బడ్జెట్ 2024-25
రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు రూ.34,743
ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు
జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం
-
2024-11-11T11:04:24+05:30
ఎస్సీ సంక్షేమం రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం రూ.39,007 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.4,376 కోట్లు
మహిళ, శిశు సంక్షేమం రూ.4,285 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1215 కోట్లు
-
2024-11-11T10:58:34+05:30
ఆరోగ్య రంగానికి రూ.18,421 కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.16,739 కోట్లు
పట్టణాభివృద్ధి శాఖకు రూ.11,490 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ.4,012 కోట్లు
జలవనరుల శాఖకు రూ.16,705 కోట్లు
పరిశ్రమలు వాణిజ్య శాఖకు రూ.3,127 కోట్లు
ఇంధన రంగానికి రూ.8,207 కోట్లు
ఆర్ అండ్ బీ శాఖకు రూ.9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.322 కోట్లు
పోలీస్ శాఖకు రూ.8,495 కోట్లు
పర్యావరణ అటవీ శాఖకు రూ.687 కోట్లు
-
2024-11-11T10:48:19+05:30
ఏపీ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే..
రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
రూ.43,402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం
సంక్షేమానికి రూ.4,376 కోట్లు కేటాయింపు
మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.4,285 కోట్లు
మానవ వనరుల అభివృద్ధికి రూ.1,215కోట్లు
పాఠశాల విద్యకు రూ. 29,909 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2,326 కోట్లు