Share News

చినవెంకన్న సేవలో డీజీపీ ద్వారకా తిరుమలరావు

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:06 AM

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర డీజీపీ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు ఆదివారం సందర్శించారు.

చినవెంకన్న సేవలో డీజీపీ ద్వారకా తిరుమలరావు

ద్వారకా తిరుమల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర డీజీపీ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు ఆదివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన బంగారు వాకిలి గుండా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ద్వారకా తిరుమలరావుకు అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని ఇచ్చి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తి స్వామి, అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

Updated Date - Nov 25 , 2024 | 04:07 AM