Share News

ఐపీఎస్‌ అధికారుల బెయిల్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Nov 27 , 2024 | 06:30 AM

ముంబయి సినీనటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పోలీసు అధికారులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు డిసెంబరు 2కి వాయిదా వేసింది.

ఐపీఎస్‌ అధికారుల బెయిల్‌పై విచారణ వాయిదా

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ముంబయి సినీనటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పోలీసు అధికారులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు డిసెంబరు 2కి వాయిదా వేసింది. మంగళవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈరోజు కౌంటర్‌ దాఖలు చేస్తున్నామని, విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ విచారణను డిసెంబరు 2కు వాయిదా వేస్తూ ఆరోజు వ్యాజ్యాలపై తుది విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. పిటిషనర్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఐపీఎస్‌ అధికారులు క్రాంతిరాణా తాతా, విశాల్‌గున్ని, విజయవాడ అప్పటి ఏసీపీ హనుమంతురావు, దర్యాప్తు అధికారి సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.

Updated Date - Nov 27 , 2024 | 06:30 AM