Share News

AP Skill Development : ఏపీలో 532 స్కిల్‌ హబ్‌లు

ABN , Publish Date - Dec 17 , 2024 | 06:22 AM

ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పీఎంకేవీవై) 4.0 అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,835 స్కిల్‌ హబ్‌(నైపుణ్య కేంద్రాలు)లు ఏర్పాటవ్వగా, ఏపీలో 532

AP Skill Development : ఏపీలో 532 స్కిల్‌ హబ్‌లు

లోక్‌సభలో కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి

న్యూఢిల్లీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పీఎంకేవీవై) 4.0 అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,835 స్కిల్‌ హబ్‌(నైపుణ్య కేంద్రాలు)లు ఏర్పాటవ్వగా, ఏపీలో 532 హబ్‌లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర నైపుణ్యాభివృద్థి సహాయమంత్రి జయంత్‌చౌదరి వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 2022-23లో 69 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసినా నిధులివ్వలేదని.. ఎవరూ శిక్షణ పొందలేదని తెలిపారు. 2023-24 245 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసి, రూ.12.58 కోట్లు ఇచ్చామని, 20,540 మంది శిక్షణ పొందారని చెప్పారు. 2024-25లో అక్టోబరు 31 వరకు 218 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసి, రూ.3.54 కోట్లు ఇచ్చామని, 14,253 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకున్నారని తెలిపారు.

ఏపీలో రూ.5,653 కోట్ల స్మార్ట్‌ పనులు పూర్తి

స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలో రూ.6,616 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులను చేపట్టగా రూ.5653.20 కోట్ల విలువైన 234 ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి టోకన్‌ సాహు రాజ్యసభలో తెలిపారు. మరో రూ.962.87 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 06:22 AM