ఇద్దరు ఏపీ వాసులకు ‘జాతీయ గోపాల్ రత్న’ అవార్డులు
ABN , Publish Date - Nov 24 , 2024 | 04:40 AM
దేశంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమ రంగంలో అత్యున్నత పురస్కారమైన జాతీయ గోపాల్ రత్న అవార్డుకు ఏపీకి చెందిన అన్నమయ్య, వి.అనిల్‌కుమార్ ఉమ్మడిగా ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): దేశంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమ రంగంలో అత్యున్నత పురస్కారమైన జాతీయ గోపాల్ రత్న అవార్డుకు ఏపీకి చెందిన అన్నమయ్య, వి.అనిల్‌కుమార్ ఉమ్మడిగా ఎంపికయ్యారు. ఉత్తమ కృత్తిమ గర్భధారణ టెక్నీషియన్(ఏఐటీ) విభాగంలో వీరికి మూడో ర్యాంకు లభించింది. ఈ నెల 26న ఢిల్లీ మానెక్ షా సెంటర్‌లో జరిగే జాతీయ పాల దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక ఆధ్వర్యంలో వీరికి అవార్డును ప్రదానం చేస్తారు.