Share News

యాంటి బయాటిక్స్‌ మందులను తగ్గించాలి

ABN , Publish Date - Nov 22 , 2024 | 11:50 PM

ప్రతి చిన్నదానికి యాంటి బయాటిక్స్‌ మందుల వాడకాన్ని బాగా తగ్గించాలని కర్నూలు మెడికల్‌ కాలేజీ ఇనచార్జి ప్రిన్సిపాల్‌ డా.హరిచరణ్‌ పేర్కొన్నారు.

యాంటి బయాటిక్స్‌ మందులను తగ్గించాలి
కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.హరిచరణ్‌

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రతి చిన్నదానికి యాంటి బయాటిక్స్‌ మందుల వాడకాన్ని బాగా తగ్గించాలని కర్నూలు మెడికల్‌ కాలేజీ ఇనచార్జి ప్రిన్సిపాల్‌ డా.హరిచరణ్‌ పేర్కొన్నారు. యాంటి మైక్రోబియల్‌ రెసిస్టెన్స అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని మైక్రో బయాలజి విభాగం ఎనఎ్‌సఎ్‌స సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు మెడికల్‌ కాలేజీ వైద్యులు, విద్యార్థులు బ్లూకలర్‌ బెలూన్సలను ఎగురవేశారు. ఈ సందర్భంగా డా.హరిచరణ్‌ మాట్లాడుతూ విపరీతంగా యాంటి మైక్రోబియల్‌ మందుల వాడకం పెరగడం వలన రెసిస్టెన్స ఏర్పడి వ్యాధులకు ఆ మందులు పని చేయకుండా పోతున్నాయనీ హెచ్చరించారు. మైక్రోబయాలజి హెచవోడీ డా.రేణుకాదేవి మాట్లాడుతూ మైక్రోబియల్‌ రెసిస్టెన్సపై చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో వ్యాధుల నివారణ కష్టమని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.సాయిసుధీర్‌, ఎనఎ్‌సఎ్‌స ప్రోగ్రాం ఆఫీసర్‌ డా.అరుణ, ప్రొఫెసర్‌ డా.నాగజ్యోతి వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 11:50 PM