-
-
Home » Andhra Pradesh » AP Assembly Session 2024 Live updates and CM Chandrababu and Dy CM Pawan Kalyan Presented to the House psnr
-
AP Assembly Session 2024 Live updates: మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ABN , First Publish Date - Jul 26 , 2024 | 10:14 AM
ఏపీ అసెంబీ సెషన్ (AP Assembly Session) 5వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Live News & Update
-
2024-07-28T00:46:29+05:30
20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి లోకేశ్
యూనివర్సిటీల్లో అధ్యాపకుల భర్తికీ అన్ని చర్యలు తీసుకుంటాం
అధ్యాపకులు లేకపోవటంతో యూనివర్సిటీల ర్యాంకింగ్స్ దెబ్బతిన్నాయి
గత ప్రభుత్వంలో యూనివర్సిటీలు రాజకీయాలకు వేదికలయ్యాయి
20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పరిశ్రమలు వస్తాయి. వాటితోపాటు ఉద్యోగాలు వస్తాయి
ట్రిపుల్ ఐటీలను బలోపేతం చేస్తాం
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఉండాలి
నేను చదువుకునేటప్పుడు ఇంటర్నప్‌షిప్ చేశాను
ఇంటర్న్‌షిప్‌తో గ్లోబల్ ఎక్స్‌పోజర్ వస్తుంది
-
2024-07-26T12:53:34+05:30
ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల
2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సభ ముందు ఉంచారు. ఐదేళ్లపాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని తెలిపారు.‘‘ గోదావరి ఉన్నంత వరకూ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు. కానీ ఆ పరిస్ధితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు. పోలవరానికి 15,364 కోట్లు ఖర్చు చేశాం. అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈపాటికే ప్రాజెక్టు ప్రారంభమయ్యేది. కేంద్రం వేసిన ఎక్సఫర్ట్ కమీటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సమాంతరంగా కొత్త డయాఫ్రాం వాల్ నిర్మించాలని అత్యవసర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నాం. దీంతో రూ.990 కోట్లు దీనికోసం ఖర్చే చేయాల్సి వస్తోంది’’ అని చంద్రబాబు అన్నారు.
-
2024-07-26T11:55:50+05:30
మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
గత ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేల భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి
మదనపల్లిలో ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు
అక్రమాలు బయటపడతాయని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేశారు
ఘటనలో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తేలింది
పెద్దారెడ్డి...పెద్దిరెడ్డి ముఠా పేదల భూములు కొట్టేశారు
సిగ్గులేకుండా జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు
జగన్ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు
కోర్టులో ఫైల్స్ దొంగతనాలు చేశాడు ఓ మంత్రి
ఇంకో మంత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టారు
ఫైల్స్ దగ్ధం ఘటనతో మిథున్ రెడ్డి మాకు సంబంధం లేదు అన్నారు
మరి ఎవరికి సంబంధం ఉందో చెప్పాలి
మొన్నటిదాకా మీరే కదా అధికారంలో ఉంది
బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారు
ప్రయత్నం బెడిసికొట్టింది
అధికారం కోసం తప్పుడు పనుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు
చేసిన పాపాలకు శిక్ష తప్పదు
ప్రజలు ఇటువంటి దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు ఢిల్లీ పారిపోయారు
శ్వేత పత్రాలపై మాట్లాడే దమ్ము, ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు లేదు
11 మంది ఉంటే ఏమైంది. ఒక్కరు చాలరా నిజాయితీగా మాట్లాడడానికి.
-
2024-07-26T11:42:32+05:30
ఇండియా కూటమిలో చేరేంత ధైర్యం జగన్‌కు ఉందా?: విష్ణుకుమార్ రాజు, బీజేపీ ఫ్లోర్ లీడర్
అంత సాహసం చేస్తాడని అనుకోవడం లేదు
-
2024-07-26T11:36:48+05:30
ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువయ్యాయి: యనమల
అసెంబ్లీ లాబీల్లో యనమల రామకృష్ణుడు మీడియాతో చిట్ చాట్
ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
జగన్‌కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలి
ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలి
జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతం
ఇండియా కూటమిలో చేరడం జగన్‌కు అనివార్యం
ఇన్నాళ్లూ బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారు
ఇప్పుడు ఎన్డీఏలో మేము, జనసేన ఉన్నాం
ఎన్డీఏ కూటమిలోకి జగన్ రాలేని పరిస్థితి
షర్మిళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. కూటమి పార్టీగా జగన్ ఇండియాలో భాగస్వామిగా ఉండబోతున్నారు
-
2024-07-26T11:23:33+05:30
మంత్రి నారా లోకేష్ సమాధానం
శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్
సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి
విద్యాకానుక పథకం కొనసాగిస్తాం
విద్యార్థులకు నాణ్యమైన కిట్స్ అందిస్తాం
తల్లికి వందనం కూడా ఇస్తాం
కొన్ని మీడియాల్లో నా వ్యాఖ్యలను వక్రీకరించారు
గత ఏడాది టెండర్స్ లేకుండా విద్యాకానుక కిట్స్ సరఫరా చేయడంపై విచారణ జరిపిస్తాం
అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి
వాటిపై నిజాలు నిగ్గు తేలుస్తాం
బ్యాగ్‌లు, బెల్టులపై రాజకీయ పార్టీల రంగులు అవసరం లేదు
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా అద్భుతంగా రూపొందిస్తాం
-
2024-07-26T10:36:47+05:30
సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు
-
2024-07-26T10:33:49+05:30
ధూళిపాళ నరేంద్ర (టీడీపీ)
ప్రభుత్వం, పాలకులు మారారు. అధికారులు మాత్రం మారలేదు
ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రకటనలు చూస్తే పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది
మంత్రి పక్షపాత ధోరణి లేదు అని ఎలా చెబుతారు
సభను తప్పుదోవ పట్టించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోండి
-
2024-07-26T10:32:38+05:30
శ్రావణ్ కుమార్
I &PR శాఖ మంత్రిని డిపార్ట్‌మెంట్ తప్పుదోవ పట్టించింది
సాక్షికి రూ.292 కోట్లు, ఈనాడుకు రూ.190 కోట్లు, ఆంధ్రక్యోతికి రూ.21 లక్షలు ప్రకటనలు ఇచ్చారు
ఏబీసీ సర్కూలేషన్ ప్రకారం చేయలేదు
ఇది పెద్ద కుంభకోణం. దీనిపై వెంటనే విచారణ చేయాలి
సర్కులేషన్ పెంచుకోవడం కోసం వాలంటీర్లు, సచివాలయం సిబ్బందికి ప్రభుత్వ సొమ్ముతో సాక్షి పత్రికను కొనిపించారు
ఈ డబ్బు అంత సీఎం ఛానల్, పేపర్‌కు ఇచ్చారు
5 సంవత్సరాలు దోచుకున్నారు
కమిషనర్ విజయకుమార్ రెడ్డికి బదిలీ అయింది
ఎంక్వైరీ పూర్తయ్యేవరకు విజయకుమార్ రెడ్డిను రిలీవ్ చేయకూడదు
అడిషనల్ కమిషనర్ కస్తూరిపై చర్యలు తీసుకోవాలి
ప్రతి పథకాన్ని నాలుగుగా విభజించి ప్రకటనలు ఇచ్చారు
జగన్ కోసం, సాక్షి మీడియాకి లాభం చేకూర్చేందుకు ప్రకటనలు ఇచ్చారు
అనుచిత లబ్ధి పొందింది మాజీ సీఎం జగన్ కుటుంబం
అనుచిత లబ్ధి చేకూర్చిన సొమ్ము ను రికవరీ చేయాలి
-
2024-07-26T10:29:20+05:30
బెందాలం అశోక్ (టీడీపీ ఎమ్మెల్యే)
కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా జగన్ వ్యవహరించారు
సచివాలయానికి, వాలంటీర్లకు సాక్షి పేపర్లు కట్టబెట్టడం చేశారు
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారు
వెంటనే హౌస్ కమిటీ వేయండి.. సొమ్మును రికవరీ చేయండి
-
2024-07-26T10:26:05+05:30
నక్కా ఆనంద్ బాబు (టీడీపీ ఎమ్మెల్యే)
ప్రజలు కోసం మీడియా కాదు..జగన్ కోసం సమాచార శాఖ పని చేసింది
ప్రకటనల్లో చంద్రబాబు ను విమర్శించారు. ఇటువంటి ధోరణి గతంలో లేదు
సాక్షికి రూ.390 కోట్లు ఇచ్చాడు
సర్కులేషన్ లేని ఇంగ్లీష్ పత్రికలకు కోట్లు దోచి పెట్టారు
ఇంగ్లీష్ మీడియా ద్వారా ఎన్నికల్లో సర్వే చేయించారు
డిజిటల్ మీడియా ద్వారా వందల కోట్లు దోచి పెట్టారు
సాక్షి ఉద్యోగులను ఇందులో పెట్టారు
‘ఐ డ్రీమ్’ అనే చెత్త ఛానల్‌ను తీసుకొచ్చి పదవి కట్టబెట్టారు
దేవేందర్ రెడ్డిని తీసుకొచ్చి చైర్మన్‌ను చేసి దోచి పెట్టారు
-
2024-07-26T10:23:31+05:30
మంత్రి పార్థసారథి..
పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంలో పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది
సాక్షికి ఒక్క పత్రికకే మొత్తం రూ.420 కోట్లు ప్రకటనలు ఇచ్చారు
ఒక జీవోను అడ్డుపెట్టుకుని అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించారు
స్పీకర్‌తో మాట్లాడి హౌస్ కమిటీను వేస్తాం
విజయకుమార్ రెడ్డిని రిలీవ్ చేయకుండా సీఎస్, ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం
అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని తేలింది
సర్కులేషన్ ప్రకారం కూడా అధికారులు వ్యవహరించలేదు
దీనిపై విచారణ చేపడతాం
వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం
-
2024-07-26T10:21:18+05:30
పత్రికలకు ప్రకటనలపై దద్దరిల్లిన సభ
అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి. పత్రికలకు ప్రకటనలపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార మంత్రి పార్థసారథి స్పందించారు. పత్రికలకు వైసీపీ ప్రకటనలు ఇచ్చే విషయంలో భారీ కుంభకోణం జరిగిందని మంత్రి సభకు తెలిపారు.
-
2024-07-26T10:12:12+05:30
అమరావతి: ఏపీ అసెంబీ సెషన్ (AP Assembly Session) 5వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి.