Home » AP Assembly Sessions
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్‌పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్"లో ఆంధ్రప్రదేశ్ చేరిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
పీఏసీ సభ్యుల ఎన్నికకు అసెంబ్లీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒకవైపు సభ జరుగుతుండగానే మరోవైపు పోలింగ్ జరుగుతోంది. కాగా ఓటింగ్‌ను బహిష్కరించే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది.
ఏపీ అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యత్వానికి శుక్రవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 12 మంది సభ్యుల పదవులకు ఎన్నిక జరుగుతుంది. బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. దీంతో సంఖ్యాబలం ప్రకారమే ముందుకు వెళ్లాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు నిర్ణయించాయి.
రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద 2014నుంచి ఇప్పటి వరకూ 250కోట్ల చొప్పున ...
రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కష్టపడి పారిశ్రామిక, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ కంపెనీలను తీసుకొచ్చిందని... కానీ, జగన్ వచ్చాక ఆ కంపెనీలు రాష్ట్రం వదిలిపోయేలా చేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ స్పష్టం చేశారు.
రాష్ట్ర అసెంబ్లీ గురువారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నవారి భరతం పట్టడంతోపాటు రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇసుక మాఫియాలను ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు, భూ దురాక్రమణల (నిషేధిత) సవరణ బిల్లుతో పాటు మరో 5 బిల్లులను ఆమోదించింది.
‘ఇష్టానుసారంగా చేస్తే.. ఇకపై మీ ఆటలు సాగవ్! రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుల భరతం పడతా. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహ శక్తులు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కఠినమైన చట్టాలను అమలు చేస్తాం.