Share News

AP Cabinet: ఏపీ కేబినెట్‌లో ప్రధానంగా చర్చించేది ఈ అంశంపైనే

ABN , Publish Date - Dec 03 , 2024 | 11:18 AM

Andhrapradesh: ఏపీ కేబినెట్‌లో10 అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడంపై కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించడంతో పాటు, ఆ నిర్ణయాలను కేబినెట్‌లో చర్చ రానున్నట్లు తెలుస్తోంది.

AP Cabinet: ఏపీ కేబినెట్‌లో ప్రధానంగా చర్చించేది ఈ అంశంపైనే
AP Cabinet meeting

అమరావతి, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్‌లో10 అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడంపై కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించడంతో పాటు, ఆ నిర్ణయాలను కేబినెట్‌లో చర్చ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Aliya Fakhri Arrest: బాలీవుడ్ నటి సోదరి అరెస్టు.. వివరాలు ఇవే..


అలాగే పలు పాలసీలకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఐటీ అండ్ గ్లోబల్ కేపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0 అంటే ఆర్‌టీజీని పునర్వ్యవస్థీకరించే అంశంపై వెర్షన్ 4.0 అమలుపై మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది. దాంతో పాటు ఏపీ టెక్స్‌టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీ 4.0, ఏపీ టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీలకు ఈరోజు కేబినెట్‌లో ఆమోద ముద్ర పడనుంది. ఇప్పటికే ఒలంపిక్స్, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ఇచ్చే ప్రోత్సకాలను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పోర్ట్స్‌ పాలసీపై కేబినెట్‌లో చర్చించనున్నారు.


అలాగే పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15 ను ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది. ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ ఆక్ట్‌లో సవరణల బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పనుంది. దీంతో పాటు 41 వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపైనే కేబినెట్‌లో సీరియస్‌గా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

రామంతాపూర్‌లో నకిలీ వైద్యుల గుట్టు రట్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 11:34 AM