Share News

CM ChandraBabu: రహదారులపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష

ABN , Publish Date - Jul 12 , 2024 | 07:13 PM

రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శుక్రవారం అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల స్థితిగతులపై ఆయన సమీక్ష నిర్వహించారు.

CM ChandraBabu: రహదారులపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష
AP CM Chandrababu

అమరావతి, జులై 12: రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శుక్రవారం అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల స్థితిగతులపై ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ తీరు కారణంగా.. రహదారుల మరమ్మతుల చేసేందుకు కాంట్రాక్టర్లూ ఎవరూ ముందుకు రావడం లేదని సీఎంకు ఉన్నతాధికారులు వివరించారు. అయితే రహదారులపై గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ. 300 కోట్లు అవసరమవుతాయని సీఎంకి అధికారులు వివరించారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి.. పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.

Also Read: Modi Govt: ‘జూన్ 25’ సంవిధాన్ హత్య దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం

అలాగే రహదారుల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై ఉన్నతాధికారులతోపాటు ఐఐటి ప్రొఫెసర్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అయితే గత ప్రభుత్వం రహదారుల స్థితిగతులను ఏ మాత్రం పట్టించుకోలేదని.. దీంతో వాహనదారులు, ప్రజలు ఈ అయిదేళ్లు నరకం చూశారన్నారు. అంతేకాదు రహదారుల మరమ్మతుల కోసం కనీస మొత్తంలో నిధులు సైతం గత ప్రభుత్వం ఖర్చు చేయలేదని సీఎంకు అధికారులు వివరించారు. రహదారుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో.. నేడు ఆ పనులు చేపట్టేందుకు ఎవరు ముందు రావడం లేదని సీఎంకి వారు సోదాహరణగా వివరించారు.

Also Read: June 25:‘మోదీ ప్రభుత్వ ప్రకటనపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ


ఇక రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రహదారులపై పాత్ హోల్స్ (గుంతలు) సమస్య ఉందని.. అదే విధంగా తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రహదారులు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయని సిఎంకు అధికారులు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో మొత్తం 7,087 కిలోమీటర్ల మేర తక్షణం పనులు చేపట్టాల్సిన అవసరముందని ఈ సమీక్షలో ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే పాత్ హోల్స్ పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. మరోవైపు అత్యవసరంగా బాగు చేయాల్సిన రహదారులపై దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అందుకోసం వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలన్నారు.

Also Read: Arvind Kejriwal bail: ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం

ఇక రహదారుల సాంకేతిక అంశాలపై నిపుణులతో చర్చించారు. రహదారుల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే అంశాలపై సైతం సీఎం సమీక్షించారు. తిరుపతి, ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆ క్రమంలో తక్కువ వ్యయంతో.. మన్నిక ఉండేలా రహదారుల నిర్మాణానికి సంబంధించిన పరిశోధనల వివరాలను ఈ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబుకు నిపుణులు వివరించారు.

Also Read: Puja Khedkar: మనోరమా కేడ్కర్ తుపాకీతో హల్‌చల్.. వీడియో వైరల్

Also Read: Punjab: ఎంపీ అమృత్ పాల్ సింగ్ సోదరుడు అరెస్ట్


సాంప్రదాయ పద్దతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై కూడా ఈ సమీక్షలో చర్చించారు. అలాగే నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలను దృష్టిలో ఉంచుకొని.. రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వర్షాకాలంలో సైతం రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికతపైనా.. వాటి సాధ్యాసాద్యాలపై నిపుణులతో చర్చించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 07:15 PM