మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు మంత్రి నారాయణ
ABN , Publish Date - Dec 19 , 2024 | 04:08 AM
ఆంధ్రప్రదేశ్‌లో 123 మున్సిపాలిటీల్లో పెట్రో ల్ బంక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అ న్నారు.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 18( ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో 123 మున్సిపాలిటీల్లో పెట్రో ల్ బంక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అ న్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్‌లో రూ.95.85 లక్షల వ్యయంతో నిర్మించిన పెట్రోల్ బంకును మంత్రి పి.నారాయణ జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి బుధవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ బంకు నిర్వహణలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఉపాధి కల్పించే విధంగా వారిని విధుల్లోకి తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజరు ప్రశాంత్ చౌహాన్, ఐవోసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.