Share News

electric buses: త్వరలో 2 వేల ఎలక్ర్టికల్‌ బస్సు సర్వీసులు

ABN , Publish Date - Dec 22 , 2024 | 03:13 AM

రాష్ట్రంలో త్వరలో 2 వేల ఎలక్ర్టిల్‌ బస్సు సర్వీసులను ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

electric buses: త్వరలో 2 వేల ఎలక్ర్టికల్‌ బస్సు సర్వీసులు

రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

పార్వతీపురం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో 2 వేల ఎలక్ర్టిల్‌ బస్సు సర్వీసులను ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీతోపాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి పార్వతీపురంలో అత్యాధునిక హంగులతో బస్టాండ్‌ నిర్మిస్తామన్నారు. వెనకబడిన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాను తమ ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. అనంతరం ఆయన పార్వతీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధునాతన క్రీడాప్రాంగణం నిర్మాణానికి భూమి పూజ చేశారు. నర్సిపురంలో ఆర్టీసీ సిబ్బంది శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. సీతానగరంలో బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పార్టీ శ్రేణులు, అధికారులు ఉన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 03:13 AM