Share News

AP Govt : కర్చీఫ్‌ వేస్తే కుదరదు

ABN , Publish Date - Oct 06 , 2024 | 05:30 AM

ఆమోదం పొందిన ఐదేళ్ల లోగా విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందే! ఒకవేళ ఆ గడువులోగా పూర్తి చేయకపోతే .. అనుమతులన్నీ రద్దయిపోతాయి. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకురానున్న ‘క్లీన్‌ ఎనర్జీ’ పాలసీలో షరతు విధించనున్నారు.

AP Govt : కర్చీఫ్‌ వేస్తే కుదరదు

  • ఆమోదం పొందిన ఐదేళ్లలోగా విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మించాల్సిందే

  • లేదంటే ఇచ్చిన అనుమతులన్నీ రద్దు.. క్లీన్‌ ఎనర్జీ పాలసీలో తేల్చిచెప్పనున్న సర్కార్‌

  • గత ప్రభుత్వ హయంలో ఇష్టారాజ్యం.. అస్మదీయులకు ఎడాపెడా కేటాయింపులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆమోదం పొందిన ఐదేళ్ల లోగా విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందే! ఒకవేళ ఆ గడువులోగా పూర్తి చేయకపోతే .. అనుమతులన్నీ రద్దయిపోతాయి. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకురానున్న ‘క్లీన్‌ ఎనర్జీ’ పాలసీలో షరతు విధించనున్నారు. ఈ నెల పదో తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో క్లీన్‌ ఎనర్జీ పాలసీని ఖరారు చేయనున్నారు. ఇంధనోత్పత్తి సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తూనే, కాలవ్యవధిలో పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని ఈ పాలసీలో స్పష్టం చేయనున్నారు. ఇప్పటికే క్లీన్‌ ఎనర్జీ ముసాయిదా విధానాన్ని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా ఆమోదించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తేలా ఈ పాలసీని తయారు చేయాలని ఇంధనశాఖను చంద్రబాబు ఆదేశించారు. నిజానికి, గత ఐదేళ్లలో సంప్రదాయేతర ఇంధన రంగంలో ఇష్టారాజ్యం సాగింది. అస్మదీయులకు నాటి జగన్‌ ప్రభుత్వం భారీగా ప్రాజెక్టులు కట్టబెట్టింది. కానీ, అవేవీ కార్యరూపం దాల్చలేదు. 5,287 మెగావాట్ల పవన, 12,075 మెగావాట్ల సోలార్‌, 17,055 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ యూనిట్లను అస్మదీయ ఇండోసోల్‌, షిరిడీ సాయి, అదానీ వంటి సంస్థలకు కట్టబెట్టింది. వేలాది ఎకరాలను కూడా కేటాయించింది.

పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టుల కోసం రిజర్వాయర్లకు సమీపంలోనే భూములను అప్పగించింది. ఈ పనులేవీ గడచిన ఐదేళ్లలో ముందుకు సాగలేదు. మొదట దరఖాస్తు చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యం అనే విధానాన్ని నాటి జగన్‌ ప్రభుత్వం అవలంభించింది. వాస్తవానికి కేంద్ర మార్గదర్శకాల మేరకు .. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టులను రివర్స్‌ టెండర్‌ విధానంలో కేటాయించాలి. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టుల కేటాయింపుల విషయంలో కేంద్రం ఆదేశాలను తుంగలోకి తొక్కి తన అస్మదీయులకు నేరుగా ప్రాజెక్టులను నాడు జగన్‌ అప్పగించేశారు. భూములు పొందినవారంతా .. ప్రాజెక్టులను నిర్మించేందుకు శ్రద్ధ చూపలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో క్లీన్‌ ఎనర్జీ పాలసీని తీసుకువస్తోంది. ్లీన్‌ ఎనర్జీ పాల


  • ముఖ్యాంశాలివే..

  1. రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధనోత్పత్తి సంస్థల స్థాపనకు సరళీకృత విధానాలు

  2. క్లీన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ను ప్రోత్సహించడం

  3. సహజ విద్యుత్తు, సంప్రదాయేతర ఇంధనోత్పత్తిని బ్యాలెన్సు చేసుకుంటూ గ్రిడ్‌పై భారం పడకుండా సమన్వయం చేసుకోవాలి.

  4. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తుల పరికరాల తయారీకి ప్రోత్సాహం

  5. క్లీన్‌ ఎనర్జీ నాలెడ్జ్‌ - స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు

  6. పునరుద్పాదక విద్యుత్తు సంస్థలకు ప్రోత్సాహకంగా కేటాయించే భూములకు స్టాంప్‌ డ్యూటీ, భూ బదలాయింపు ఫీజు మినహాయింపు

  7. ఎస్‌జీఎస్టీ రీ యింబర్స్‌మెంట్‌ చేస్తారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు

  8. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల పొడవైన సముద్రతీర ప్రాంతాన్ని సోలార్‌, విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించుకోవాలి.

  9. మొత్తంగా 78.50 గిగావాట్‌ సోలార్‌, 35 గిగావాట్‌ విండ్‌, 22 గిగావాట్‌ పంప్డ్‌ స్టోరేజీ, 25 గిగావాట్‌ బ్యాటరీ స్టోరేజీ ఉత్పత్తేలక్ష్యం.

  10. ఏటా 1.50 మిలియన్‌ మెట్రిక్‌ టన్ను గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇంధనం, రోజుకు 1000 టన్నుల బయో ఫ్యూయల్స్‌ వాడకం ఉండేలా చర్యలు.

Updated Date - Oct 06 , 2024 | 05:30 AM