Share News

Ram Gopal Varma : పారిపోలేదు.. నా డెన్‌లోనే ఉన్నా

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:27 AM

తనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హైదరాబాద్‌లో విలేకరుల తో మాట్లాడారు. ఆర్జీవీ గోడ దూకి పారిపోయాడు,

 Ram Gopal Varma : పారిపోలేదు.. నా డెన్‌లోనే ఉన్నా

జైలుకు పంపిస్తే సినిమా కథలు రాసుకుంటా: ఆర్జీవీ

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హైదరాబాద్‌లో విలేకరుల తో మాట్లాడారు. ఆర్జీవీ గోడ దూకి పారిపోయాడు, దాక్కున్నాడు.. అంటూ మీడియానే కథలల్లుతోందని అసహనం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, డెన్‌లోనే ఉన్నానని, షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్లతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఇప్పుడు తన మీద కేసులు నమోదు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఒకవేళ అరెస్టు చేస్తే.. జైలుకెళ్లి, అక్కడ ఖైదీలతో పరిచయం పెంచుకొని, నాలుగు సినిమా కథలు రాసుకుంటానన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 05:27 AM