Share News

రాష్ట్రంలో పుట్టే ప్రతీ బిడ్డపైనా అప్పే

ABN , Publish Date - Mar 10 , 2024 | 03:28 AM

ఆంధ్ర అంతకంతకు అప్పుల పాలవుతోంది. రేపు పుట్టబోయే బిడ్డలపై కూడా అప్పుల భారం పడే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది’ అని అంతర్జాతీయ సువార్తీకుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో పుట్టే ప్రతీ బిడ్డపైనా అప్పే

శాసనాలను మార్చేయడం దారుణం

శత్రువులందరూ నశించి పోవుదురుగాక: బ్రదర్‌ అనిల్‌

అమలాపురం రూరల్‌, మార్చి 9: ‘ఆంధ్ర అంతకంతకు అప్పుల పాలవుతోంది. రేపు పుట్టబోయే బిడ్డలపై కూడా అప్పుల భారం పడే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది’ అని అంతర్జాతీయ సువార్తీకుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో శనివారం పాస్టర్ల సదస్సును సికిలే ధనరాజు ఆధ్వర్యంలో డేనియల్‌ పాల్‌ అధ్యక్షతన నిర్వహించారు. బైబిల్‌లోని అనేక వాఖ్యాలను వివరిస్తూనే మధ్యమధ్యలో రాష్ట్ర పాలకుల తీరును ఆయన విమర్శించారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలను తీసుకువస్తున్నారన్నారు. శత్రువులందరూ నశించి పోవుదురుగాక అని అనిల్‌ పేర్కొన్నారు. క్రైస్తవ యువ నాయకులు, సంఘ పెద్దలు మాట్లాడుతూ... ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. వైఎస్‌ బిడ్డగా జగన్‌కు అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం సువార్త సభలు పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది’ అని అన్నారు.

Updated Date - Mar 10 , 2024 | 08:58 AM