Share News

ఉచిత డీఎస్సీ శిక్షణకు దరఖాస్తులు

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:03 AM

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకటలక్ష్మమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

   ఉచిత డీఎస్సీ శిక్షణకు దరఖాస్తులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకటలక్ష్మమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో టీటీసీ, బీఈడీ, ఏపీ టెట్‌లో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్లూఎస్‌/ఈబీసీ అభ్యర్థులు అర్హులు అని తెలిపారు. ఈ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏపీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో స్వయంగా వచ్చి తమ బయోడేటాతో పాటు రెండు ఫొటోలు, స్టడీ, టెట్‌, కుల, ఆదాయం ధృవీకరణ పత్రాలు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌, ఆధార్‌ కార్డు పానకార్డు జిరాక్స్‌ ప్రతులను దరఖాస్తుకు జతపరిచి ఈ నెల 15వ తేదీలోపు సమర్పించాలన్నారు. అభ్యర్థుల ఎంపిక టెట్‌ మెరిట్‌ ప్రాతిపదికన జరుగుతుందన్నారు. వివరాలకు కర్నూలు అబ్బాస్‌ నగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో కార్యాలయంలోగాని, 08518-236076 నెంబరులోగాని సంప్రదించాలన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:03 AM