ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా ఏపీ
ABN , Publish Date - Dec 12 , 2024 | 03:44 AM
విజన్-2047లో భాగంగా ఏపీని విద్యుత్తు వాహనాల తయారీకి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ (4.0) 2024-29ను ప్రభుత్వం విడుదల చేసింది.
కొత్త ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ విడుదల
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): విజన్-2047లో భాగంగా ఏపీని విద్యుత్తు వాహనాల తయారీకి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ (4.0) 2024-29ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించడంపై దృష్టి సారించిన ప్రభుత్వం విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దానికి అవసరమైన విద్యుత్తు వాహనాల విడిభాగాలు, చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీలు, సంబంధిత పరికరాల తయారీదారులకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను పాలసీలో ప్రకటించారు. వీటిని ఎంఎ్‌సఎంఈలు పెట్టుబడి రాయితీ రూపంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.