ఆర్లబండ ఖాళీ !
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:42 PM
మండల పరిధిలోని ఆర్లబండ గ్రామం నుంచి ఒకే రోజు 200 కుటుంబాల వలస కూలీలు లారీలు, బొలేరో వాహనాల్లో గుంటూరుకు వలసబాట పట్టారు.
ఒకేరోజు 200 కుటుంబాలు గుంటూరుకు పయనం
ఉపాధి పనుల్లేక ఊరువదిలిన కూలీలు
చోధ్యం చూస్తున్న అధికారులు
కోసిగి, జనవరి 30: మండల పరిధిలోని ఆర్లబండ గ్రామం నుంచి ఒకే రోజు 200 కుటుంబాల వలస కూలీలు లారీలు, బొలేరో వాహనాల్లో గుంటూరుకు వలసబాట పట్టారు. గ్రామంలో ఉపాధి పనులు లేక వలస వెళ్తున్నట్లు కూలీలు కన్నీరు మున్నీరై విలపించారు. చేసిన పనులకు కూడా ఉపాధి వేతనాలు రాకపోవడంతో వలసలు తప్పడం లేదని కూలీలు ఆవేదన చెందారు. మంగళవారం రాత్రి వేళల్లో చంటి పిల్లలను పట్టుకుని పిల్లాపాపలతో కలిసి లారీల్లో గుంటూరుకు వలసబాట పట్టారు...