చవితి వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం
ABN , Publish Date - Sep 06 , 2024 | 11:26 PM
చవితి వేడుకలను పురస్కరిం చుకుని పార్వతి సుతుడైన వినాయకుడిని పూజించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు.
మహాగణపతి
మదనపల్లె టౌన/అర్బన, సెప్టెంబరు 6: చవితి వేడుకలను పురస్కరిం చుకుని పార్వతి సుతుడైన వినాయకుడిని పూజించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రతి చోట మండపాలను ఏర్పాటు చేసి వినాయక ప్రతిమలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు నిమగ్నమయ్యా రు. ఆయా మండపాలకు ఇప్పటికే పూజలందుకోవడానికి గణనాఽథులు తరలివెళ్లారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కళ్యాణమండపం, బెంగ ళూరు బస్టాండు, చిత్తూరు బస్టాండు వద్ద వివిధ ఆకృతులు, సైజులతో తయారు చేసిన వినా యకుడి ప్రతిమలను నిర్వాహకులు కొనుగోలుచేసి మండపాలకు ట్రాక్టర్లలో తరలించారు. అలాగే వినాయక ప్రతిమల వద్ద పూజ కోసం పూలు. పండ్లు తదితర పూజా సామగ్రిని తీసుకెళ్లేందుకు ప్రజలు మార్కెట్లకు వెళ్లడంతో జనాలతో కిటకిలాడాయి. సందట్లో సడే మియా అన్నట్లు పూలు, పండ్లు పూజాసామగ్రిని కొందరు అధిక ధరలకు విక్రయించినట్లు జనం వాపోయారు. మదనపల్లె పట్టణంలో పలు చోట్ల ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందించారు.
ములకలచెరువులో: ములకలచెరువులో శుక్రవారం నుంచే వినాయక చవి తి సందడి నెలకొంది. కాగా వారపు సంత కూడా ఉండడంతో పట్టణం జనంతో కిక్కిరిసిపోయింది. వినాయక చవితి సందర్భంగా పూల ధరలు చుక్క లనంటాయి. కిలో చామంతి రూ.400లకు విక్రయించారు. బంతి పూలు కిలో రూ.60 వరకు విక్రయించారు.
పీలేరులో: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు పీలేరు ప్రజలు సమాయాత్తమయ్యారు. ఒక్క పీలేరు పట్టణంలోనే 100పైగా సెంటర్లలో విగ్రహాలు ఏర్పాటు చేయడం రివాజు. పీలేరు పట్టణం సాయం త్రం నుంచి పూజాసామాగ్రి కొనుగోలు కోసం ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన ప్రజలతో నిండిపోయింది. వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాలనే లక్ష్యంతో స్థానిక సాయిబాబా భవన నిర్మాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమాన్ని పలువురు అధికారులు, టీడీపీ నాయకులు వినాయకుడికి పూజలు చేసి ప్రారంభించారు.
తంబళ్లపల్లెలో :తంబళ్లపల్లె మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి పండుగకు మండపాలు ముస్తాబయ్యాయి. మండల కేంద్రంలోని పాత కళాశాల మైదానంలో గణేశ యూత (వినాయక ఉత్సవకమిటీ) ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో ప్రతి రోజు ఉదయం, సాయం త్రం ప్రత్యేక పూజలు ఉంటాయనితెలిపారు. మండపం వద్ద శని, ఆది, సోమ వారాలు 3 రోజుల పాటు అన్నదానం ఉంటుందన్నారు.