Home » Annamayya District
TDP Leaders Clash: అన్నమయ్య జిల్లా టీడీపీలో రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇవాళ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎదుటనే ఢీ అంటే ఢీ అని కొట్టుకునే వరకు ఇరువర్గాల నేతలు వెళ్లారు. రెండు వర్గాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు మాత్రం వినకపోయే సరికి మంత్రి కూడా చేతులు ఎత్తేశారు. ఈ వివాదాన్ని టీడీపీ హై కమాండ్ దృష్టికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అన్నమయ్యజిల్లాలో విషాదం నెలకొంది. మైలపల్లెరాచపల్లెకు చెందిన ఏడేళ్ల వయసుగల ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటికుంటలో మునిగి చనిపోయారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీలో లా అండ్ పరిస్థితులు దిగజారిపోయాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని జగన్ విమర్శించారు.
అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కలెక్టర్ రమాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రమేష్‌బాబు పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభు త్వాస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో టీబీ ముక్త్ భా రత్ పంచాయతీకి ఎన్నికైన యూనిట్ పరిధిలోని మం చూరు, తాటిగుంటపల్లె, కలికిరి మండలం మున్నేళ్లపల్లె, నిమ్మనపల్లె మండలంలో కొండయ్యగారిపల్లె, తవళం పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం టీబీ అంతం మన పంతం నినాదాలతో పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వ హించారు.
పట్టణంలో ఇరుకైన వీధులు, విస్తారమైన రోడ్లలో కూ డా నడిరోడ్లపై ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేశారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొందరు ప్రైవేటు భవన యజామనులు నడిరోడ్లపై ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తు న్నారు.
ఏలూరు వద్ద జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగాయి. ఒకే సమయంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బుధవారం తెల్లవారు జామున ఏలూరు శివారు జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. కాకినాడ నుండి గుంటూరు వెళుతున్న అల్ట్రా డీలక్స్ ఆర్టిసీ బస్సు.. లారీని ఢీ కొట్టింది. మరో ఘటనలో..
Posani Health Police says : సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట సబ్ జైల్లో ఆరోగ్యం బాగాలేదంటూ లబోదిబోమంటూ గోల చేయడంతో హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పోసాని అనారోగ్యం పేరుతో ..
పోసాని కృష్ణ మురళీకి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానం తీర్పుపై హైకోర్టుకు వెళతామని అన్నారు. పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే ‘ఆపరే షన్ సక్సెస్ పేషెంట్ డైడ్’ అన్న ట్లు ఉందన్నారు.
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీకి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసానిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అతనికి నోటీసు ఇచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.