Arrest of inter-district thieves : అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:25 PM
అంతర్‌జిల్లా దొం గలను అరెస్టు చేసి ఆరు లక్షల రూపాయల విలువైన బంగా రు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కృష్ణమోహ న్ తెలిపారు.
రూ.6 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం : డీఎస్పీ
రాయచోటిటౌన్, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): అంతర్‌జిల్లా దొం గలను అరెస్టు చేసి ఆరు లక్షల రూపాయల విలువైన బంగా రు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కృష్ణమోహ న్ తెలిపారు. రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్‌లో వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలి వాసి నడింపల్లి గోపీ, నెల్లూరు పట్టణం గుడిపిల్లపాడు ప్రాంతం లక్ష్మీగణపతి వీధికి చెందిన లింగుబెరి రాంబాబు జూన్ 30న పట్టణంలోని లక్ష్మీపురంలో రెండు ఇండ్లల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం వారిని అరెస్టు చేసి, రూ.6 లక్షల విలువైన 86.500 గ్రాములు బంగా రు నగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నింది తులపై ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కనిగిరి, వేదాయపాలెం, యలమంచిలి, నెల్లూరు, పత్తిపాడు, సింగరాయకొండ, జలదం కి, పొదలి, కావలి, చిలకపూడి, పామూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో చోరీ కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ కేసు లో చాకచక్యంగా వ్యవహరించిన అర్బన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు నరసింహారెడ్డి, అబ్దుల్‌జహీర్, పోలీసు సిబ్బంది రామచంద్ర, బరక్‌తుల్లా, మహేందరనాయుడు, పెంచలయ్య, మహేంద్ర, టెక్నికల్ అనాలసిస్ వింగ్ కానిస్టేబుల్ రవి తదిత ర సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.