Share News

విశాఖ డెయిరీపై సభా సంఘం చైర్మన్‌గా జ్యోతుల

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:37 AM

విశాఖ డెయిరీలో అవినీతి, అక్రమాలపై విచారణకు సభా సంఘం ఏర్పాటైంది.

విశాఖ డెయిరీపై సభా సంఘం చైర్మన్‌గా జ్యోతుల

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): విశాఖ డెయిరీలో అవినీతి, అక్రమాలపై విచారణకు సభా సంఘం ఏర్పాటైంది. అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు శుక్రవారం దీని కూర్పును ప్రకటించారు. సీనియర్‌ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బొండా ఉమా మహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌వీఎ్‌సకేకే రంగారావు, దాట్ల సుబ్బరాజు ఇందులో సభ్యులుగా వ్యవహరిస్తారు. అసెంబ్లీలో విశాఖ డెయిరీ వ్యవహారాలపై చర్చ తర్వాత ఆర్థిక అక్రమాలపై విచారణకు ప్రత్యేక సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ నెల 20న నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఈ కమిటీ ఏర్పడింది.

రహదారిపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌గా ఆర్‌అండ్‌బీ మంత్రి రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులకు ఎదురవుతున్న అడ్డంకులు, సవాళ్లను సత్వరమే అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి చైర్మన్‌గా ఉండే ఈ టాస్క్‌ఫోర్స్‌లో 12 మంది అధికారులు సభ్యులుగా ఉంటారు.

Updated Date - Nov 30 , 2024 | 03:37 AM