దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:49 PM
హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి కల్గించి స్వయంప్రతిపత్తి కల్పించాలని, ఉత్తమ ధార్మిక వ్యవస్థ ఏర్పాటుకు చట్టసవరణ చేయాలని పీఠాధిపతి సుబుఽధేంద్ర తీర్థులు అన్నారు.
మంత్రాలయం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి కల్గించి స్వయంప్రతిపత్తి కల్పించాలని, ఉత్తమ ధార్మిక వ్యవస్థ ఏర్పాటుకు చట్టసవరణ చేయాలని పీఠాధిపతి సుబుఽధేంద్ర తీర్థులు అన్నారు. హైందవ శంఖారావం జిల్లా కో కన్వీనర్, టీటీడీ ధర్మప్రచార మం డలి సభ్యుడు నాయకంటి భీమారెడ్డి, పలువురు శనివారం పీఠాధిపతిని కలిసి హైందవశంఖారావం మహాసభకు ఆహ్వానించి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భాంగా స్వామిజీ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాలను, సాంప్రదాయాలను, మఠాలను, పీఠాలను కాపాడాలన్నారు. ఇందు కోసం తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. హిందూవులంతా కలిసికట్టుగా పోరాటాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మప్రచార మండలి సభ్యులు సూర్యనారాయణ ఆచార్, బీమా లింగారెడ్డి, శ్రీరాముల యాదవ్, మురళిధర్, సోమిరెడ్డి, సీతారాముడు, గురు పాల్గొన్నారు.
శోభాయమానంగా ధాత్రి హోమం
కార్తీక పౌర్ణమి ముగింపు సందర్భంగా ధాత్రి హోమం శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం అభయ ఆంజనేయస్వామి సన్నిధిలోని ఉసిరి, తులసి వనాల మధ్య సంస్థాన పూజ చేశారు. ధాత్రి హోమాల్లో దూప, దీప నైవేద్యాలు, సుగం ధ ద్రవ్యాలు వేసి పీఠాధిపతి పూర్ణాహుతి చేశారు. ఉసిరి చెట్టుకింద పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మూలరాము లు, జయరాములు, దిగ్విజయరాములకు కనకాభిషేకం చేసి మహామంగళ హారతులు ఇచ్చారు. అనంతరం వనభోజనం నిర్వహించారు. కార్యక్రమంలో విద్వానరాజా ఎస్ గిరిరాజాచార్, మేనేజర్లు వెంకటే్‌షజోషి, శ్రీపతిఆచార్, ఐపీనరసింహమూర్తి, డీఎం ఆనందరావు, అనంత పురాణిక్, విజయేంద్రాచార్, రవికులకర్ణి, జేపీస్వామి, అనంతస్వామి పాల్గొన్నారు.
స్వర్ణ రథంపై విహరించిన ప్రహ్లాదరాయలు
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారం కార్తీక పాడ్యమి శుభదినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణ రథంపై వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయులను అధిష్టించి ఆలయ ప్రాంగణ చుట్టూ ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తికి ఊంజలసేవ నిర్వహించారు.