Share News

అవినాశ్‌, జోగి అండ్‌ కో సహకరించడం లేదు

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:01 AM

టీడీపీ కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడుల కేసుల్లో నిందితులు విచారణకు సహకరించడం లేదని ఆంధ్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అవినాశ్‌, జోగి అండ్‌ కో సహకరించడం లేదు

సుప్రీం ఆదేశాలనూ పాటించడం లేదు

టీడీపీ ఆఫీసు, బాబు నివాసంపై దాడి కేసుల్లో సుప్రీంకోర్టుకు ఆంధ్ర ప్రభుత్వం నివేదన

న్యూఢిల్లీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడుల కేసుల్లో నిందితులు విచారణకు సహకరించడం లేదని ఆంధ్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు సంస్థలకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా పాటించడం లేదని సోమవారం తెలిపారు. ఈ వ్యవహారంలో అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు. జస్టిస్‌ సుధాం శు ధూలియా, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణను డిసెంబరు 17 కి వాయిదా వేసింది. నిందితులకు కల్పించిన మధ్యంతర రక్షణను అప్పటివరకు పొడిగించిం ది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత లు దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌, మరికొందరిపై కేసులు నమోదు చేశారు. వీరికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకో ర్టు అంగీకరించలేదు. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ పొందారు. అయితే, దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆదేశించిం ది. ఈ పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. నిందితుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ విచారణను జనవరికి వాయిదా వేయాలని కోరారు. దీనిపై లూథ్రా అభ్యంతరం తెలిపారు. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 04:01 AM