తాగునీటి ఎద్దడిని నివారిస్తాం
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:32 AM
గోరుకల్లు వాటర్ గ్రిడ్ వాటర్ ప్లాంటు ద్వారా రాను న్న వేసవిలో బేతంచెర్ల, డోన మండలాల ప్రజలకు నీటి ఎద్దడి నివారణ కు శుద్దజలాన్ని సరఫరా చేస్తామ ని కలెక్టర్ రాజకుమారి గనియా తె లిపారు.
ఫ కలెక్టర్ రాజకుమారి
ఫ వాటర్ ప్లాంట్ పరిశీలన
బేతంచెర్ల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : గోరుకల్లు వాటర్ గ్రిడ్ వాటర్ ప్లాంటు ద్వారా రాను న్న వేసవిలో బేతంచెర్ల, డోన మండలాల ప్రజలకు నీటి ఎద్దడి నివారణ కు శుద్దజలాన్ని సరఫరా చేస్తామ ని కలెక్టర్ రాజకుమారి గనియా తె లిపారు. బుధవారం మండలంలోని బుగ్గానిపల్లె తండా గ్రామ సమీపం లో ఏర్పాటు చేసిన వాటర్ గ్రిడ్ ప్లాంట్ మెగా కంపెనీ చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. ముం దుగా గోరుకల్లు రిజర్వాయర్‌ను పరిశీలించిన తర్వాత మెగా కంపెనీ చేపట్టిన శుద్ధజల ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోరుకల్లు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా 138 గ్రామాలకు చెందిన 2.86 లక్షల మంది ప్రజలకు మినరల్ వాటర్‌ను అందిస్తున్నామని తెలిపారు. 66 ఓహెచఆర్ ట్యాంకుల ద్వారా శుద్ధ జలాన్ని ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు. గోరుకల్లు నుంచి డోన వరకు పైపులైన్ల ద్వారా నీటి సరఫరా అందించేందుకు నాలుగు సంపుల ద్వారా సరఫరా చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ పథకం ద్వారా మార్చి నాటికి ప్రజలకు శుద్ధ జలం అందజేస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట డోన ఆర్డీవో నరసింహులు, డోన తహసీల్దార్, బేతంచెర్ల ఇనచార్జి తహసీల్దార్ నాగమణి, ఎం పీడీవో ఫజిల్ రెహిమాన, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మనోహర్, ప్రాజె క్టు డీఈ సోమశేఖర్, ప్రాజెక్టు ఏఈలు బాలకృష్ణ, మనోజ్, ఎల్లరాజు, జయదీప్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజశేఖర్ రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్, మెగా కంపెనీ ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.