Share News

బడుల్లో పండుగ

ABN , Publish Date - Dec 04 , 2024 | 11:24 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు సహృద్భావ వాతావరణం కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 బడుల్లో పండుగ
ఆలూరు ప్రభుత్వ పాఠశాల

విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం

ఈనెల 7న మెగా పేరెంట్స్‌, టీచర్ల సమావేశం

విద్యాపరమైన అంశాలపై చర్చ

ఆటల పోటీలు, సహపంక్తి భోజనాలు

పూర్వ విద్యార్థులకు ఆహ్వానం

జిల్లాకు రూ.47 లక్షలు మంజూరు

ఆలూరు, డిసెంబరు 4, (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు సహృద్భావ వాతావరణం కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో ఉత్తమ విద్య అందించేందుకు, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కలిపి ఒకే వేదికపైకి చేర్చింది. విద్యాపరమైన అంశాలను చర్చించడంతోపాటు ఆట పాటలు, శుభ తిథి పేరుతో సహపంక్తి భోజనాలు, పిల్ల ప్రగతి నివేదికలు అందజేయనున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ ఆదేశాల మేరకు శుభతిథి పేరుతో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్‌, టీచర్స్‌ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు విద్యాశాఖ అఽధికారులు అన్ని ఏర్పాట్లు విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాలల మధ్య సంబంధాలను బలపరచడానికిశ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి 2047 నాటికల్లా వికసిత ఆంధ్రప్రదేశగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. దీనిలో భాగంగానే జిల్లాలోని 1485 ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ సమావేశాన్ని ప్రతిష్ర్టాత్మకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసంగా రూ.47 లక్షల నిఽధులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. పది మంది పిల్లలు ఉన్న బడులకు రూ.వెయ్యి, 300 నుంచి 200 మంది పిల్లలు ఉన్న రూ. 5 వేలు ఇలా సంఖ్యలను బట్టి ఆయా పాఠశాలలకు నిధులను కేటాయించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు ఆ కార్యక్రమంలో పర్యవేక్షించనున్నారు. వారం రోజులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే కలెక్టర్‌ అధికార్లకు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల కమిటీల సమావేశాలు కొత్త కానప్పటికీ ఈసారి మాత్రం పలు ప్రత్యేకతలు రూపొందించారు. ఎన్నడూ లేని విధంగా పిల్లల సంఖ్యను బట్టి ఆయా పాఠశాలలకు నిధుల కేటాయింపులు చేశారు. పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు ఎవరి స్థాయిలో వారు మరికొంత నిధులు సేకరించి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆహ్వానం కమిటీ, నిర్వహణ కమిటీ, బడ్జెట్‌ కమిటీ, బడి సుందరీకరణ కమిటీ, పర్యావరణ పరిరక్షణ కమిటీ, నిర్వహణ కమిటీ, స్టేజీ నిర్వహణ వంటి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

ఫ పిల్లల ప్రగతిపై నివేదికలు

పిల్లల ప్రగతికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను ఈ సమావేశంలోనే తల్లిదండ్రులకు అందజేయనున్నారు. ప్రోగ్రెస్‌ కార్డుల్లో మార్పులు, హాజరుతోపాటు ఆటలు, సాంస్కృతిక నిర్ధారణ పరీక్షల వివరాలు పొందుపరుస్తున్నారు. విద్యార్థులు ఇళ్ల వద్ద సెల్‌ఫోన, ట్యాబ్‌లు అధికంగా వినియోగించకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు తల్లిదండ్రులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. పూర్వ విద్యార్ధులు, ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించి కార్యక్రమం విజయవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే సమావేశానికి సంబంధించి మీటింగ్‌ షెడ్యూలు కూడా విడుదల చేశారు. ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు వివిధ కార్యక్రమాల అనంతరం సహపంక్తి భోజనం చేస్తారు.

ఫ ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్‌ కమిటీ నిర్వహణ - శామ్యూల్‌ పాల్‌, జిల్లా విద్యాశాఖాధికారి

జిల్లా మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ను డిసెంబరు 7న జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు ప్రొగ్రాస్‌ కార్డులు అందిచడంతోపాటు పాఠశాలల అభివృద్ధి చేస్తున్న, చేపట్టబోవు కార్యక్రమాలపై తల్లిదండ్రులతోపాటు పాఠశాలల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం, పది పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, సైబర్‌ నేరాలపై అవగాహన, విద్యార్థుల పురోగతి. జరిగిన పరీక్షల్లో వచ్చిన మార్కుల గూర్చి ఈ మెగా పేరెంట్స్‌ మీటింగ్‌ ప్రత్యేక ఉద్యేశం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు సూచనలు, సలహాలతో కార్యక్రమం విజయవంతం చేస్తాం.

Updated Date - Dec 04 , 2024 | 11:24 PM