Share News

బీసీ ప్రీమెట్రిక్‌ గర్ల్స్‌ హాస్టళ్లను ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Jul 09 , 2024 | 01:00 AM

ఆదోని పట్టణంలో బాలికలకు బీసీ ప్రీమెట్రిక్‌ బాలికల హాస్టల్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

బీసీ ప్రీమెట్రిక్‌ గర్ల్స్‌ హాస్టళ్లను ఏర్పాటు చేయాలి

ఆదోని (అగ్రికల్చర్‌), జూలై8 : ఆదోని పట్టణంలో బాలికలకు బీసీ ప్రీమెట్రిక్‌ బాలికల హాస్టల్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు బాలికల తల్లిదండ్రులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు హాస్టల్‌ సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారన్నారు. హాస్టల్‌ సీట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండక వలసలు వెళ్తున్నారని, తమ పిల్లలను హాస్టల్లో వదిలి చదివిద్దామంటే, హాస్టళ్లు లేక మధ్యలోనే చదువులు మానేసే పరిస్థితి నెలకొందని అన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మకు వితనిపత్రం అందజేశారు. నాయకులు గౌస్‌, శశిధర్‌, మోహన్‌, నాగరాజు, అమ్రేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 01:00 AM