Share News

ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి

ABN , Publish Date - Nov 14 , 2024 | 01:12 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభా వంతో ఉప్పాడ తీరంలో సముద్రం అల ్లకల్లోలంగా మారింది.

ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి

ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి

రాకపోకలు బంద్‌

కొత్తపల్లి, నవంబరు 13(ఆంరఽధజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభా వంతో ఉప్పాడ తీరంలో సముద్రం అల ్లకల్లోలంగా మారింది. పౌర్ణమి దగ్గర కావడం, అల్పపీడనం తోడు కావడంతో బుధవారం రాత్రి రాకాసి కెరటాలు బీచ్‌రోడ్డుపైకి దూసు కొస్తున్నాయి. ఇక్కడి పరిస్థితిని గమనించిన కొత్తపల్లి పోలీసులు ఉప్పాడ బీచ్‌రోడ్డు గుండా వాహనాలు ప్రయాణించకుండా రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేసి రాకపోకలను నిలిపివేశారు.

Updated Date - Nov 14 , 2024 | 01:12 AM