సమస్యలపై అధికారులను నిలదీసిన లబ్ధిదారులు
ABN , Publish Date - Sep 28 , 2024 | 11:44 PM
కనీస సౌక ర్యాలు కల్పించకుండా ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపట్టాలంటూ లబ్ధిదారులు అధికా రులను నిలదీశారు.
నిమ్మనపల్లి, సెప్టెంబరు 28: కనీస సౌక ర్యాలు కల్పించకుండా ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపట్టాలంటూ లబ్ధిదారులు అధికా రులను నిలదీశారు. శనివారం స్థానిక పం చాయతిలోని దండువారిపల్లి వద్ద ప్రస్తుత ప్రభుత్వం మన ఇళ్లు..మన గౌరవం కార్య క్రమాన్ని చేపట్టడానికి వచ్చిన ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీడీవో రమేష్, హౌసిం గ్ ఏఈ అమరలను లబ్ధిదారులు సమస్యల పై నిలదీశారు. మంజూరై ఇళ్లను కట్టుకోవాలంటే సరైన వసతులు లేవని కనీసం నీటి సదుపాయం కల్పించలేదన్నారు. అలాగే కాలనీకి రోడ్లు కరెంటు, మురుగునీటి కాలువ లు, మరగుదొడ్లు వంటివి కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. అంతే కాకుండా కాల నీకి వేసిన బోరును ఉపయోగంచకుండా అధికారుల వేధిస్తున్నారని తెలిపారు. అయితే ప్రత్యేక అధికారి మాట్లాడుతూ లబ్ధిదారుల అర్జీ రూపంలో ఇస్తేనే పరిశీలిస్తామని తెలిపా రు. అనంతరం కాలనీలో మన ఇళ్లు..మన గౌరవంపై లబ్ధిదారులకు వివరించారు.
పట్టాలిచ్చారు..ప్లాటు చూపాలి కదా?
బి.కొత్తకోట, సెప్టెంబరు 28: జగనన్న పట్టాలిచ్చారు..ప్లాటు ఎక్కడుందో తెలియ దు అని కొందరు, కట్టిన కాడికి బిల్లులు ఇవ్వలేదని ఇంకొందరు.. కరెంటులేదు, నీళ్లులేవు ఇళ్లు ఎలాకట్టేది అని మరికొం దరు లబ్ధిదారులు అధికారులను నిలదీశా రు. శనివారం మన ఇల్లు- మనగౌరవం కార్యక్రమంలో భాగంగా బి.కొత్తకోట నగరపం చాయతీ పరిధిలోని తాకాటంవారిపల్లె రోడ్డు లోని లేఅవుట్ వద్ద హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసీంగ్ ఈఈ వెంకటదాస్, నగరపంచాయతీ కమిషనర్ పల్లవిలు మా ట్లాడుతూ డిసెంబరు 30 నాటికి ఇళ్లనిర్మాణాలు పూర్తిచేయాలని, పెండింగ్ బిల్లులు త్వర లో చెల్లిస్తామని, నిర్మాణాలు ప్రారంభించని ఇళ్లు రద్దు అవుతాయని తెలిపారు. ఎంపీడీ వో శంకర య్య, హౌసింగ్ డీఈ వెంకటరెడ్డి, ప్రత్యేకఅధికారి చంద్రశేఖర్, ఏపీఎం రాజేశ్వ రి, ఎండీ మస్తాన, వర్క్‌ఇనస్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది మౌలాలి, ఖలీల్ పాల్గొన్నారు.