Share News

BJYM : మెగా డీఎస్సీపై బీజేవైఎం ధన్యవాదాలు

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:34 AM

ప్రతి సంవత్సరం మొదటి నెలలో జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తానంటూ నిరుద్యోగ యువతను మభ్యపెట్టి మోసం చేసిన జగన్‌ రెడ్డి పాలన పోయి.. ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకంతోనే మెగా డీఎస్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బీజేవైఎం నేతలు పేర్కొన్నారు.

BJYM : మెగా డీఎస్సీపై బీజేవైఎం ధన్యవాదాలు

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ప్రతి సంవత్సరం మొదటి నెలలో జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తానంటూ నిరుద్యోగ యువతను మభ్యపెట్టి మోసం చేసిన జగన్‌ రెడ్డి పాలన పోయి.. ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకంతోనే మెగా డీఎస్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బీజేవైఎం నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడు మిట్టా వంశీ, ప్రధాన కార్యదర్శి నవనీత్‌ కృష్ణ తదితరులు విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. పాదయాత్రలో యువతను నమ్మించిన జగన్‌ నైజం అధికారంలో బయట పడిందని, ప్రజలు, నిరుద్యోగులు రెండోసారి మోసపోకుండా ఓటుతో వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పనలో భాగంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే కీలక నిర్ణయాలు తీసుకోబోతోందని బీజేవైఎం నేతలు వెల్లడించారు.

Updated Date - Jun 16 , 2024 | 07:15 AM