Share News

Latest News: నేటి తాజా వార్తలు

ABN , First Publish Date - Nov 11 , 2024 | 04:25 PM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

Latest News: నేటి తాజా వార్తలు
Breaking News

Live News & Update

  • 2024-11-11T21:49:15+05:30

    అంతర రాష్ట్ర మండలి స్థాయి సంఘంలో చంద్రబాబుకు చోటు

    • అంతర రాష్ట్ర మండలి స్థాయి సంఘాన్ని పునర్ వ్యవస్థీకరించిన కేంద్ర ప్రభుత్వం

    • పునర్ వ్యవస్థీకరించిన కమిటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చోటు

    • కమిటీకి నేతృత్వం వహించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    • చంద్రబాబునాయుడుతో పాటు మరో 12 మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు సభ్యులుగా చోటు

    • ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తో పాటు కమిటీలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ , నిర్మలా సీతరామన్, రాజీవ్ రంజన్ సింగ్, వీరేంద్ర కుమార్, సీఆర్ పాటిల్ , అస్సాం, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు

  • 2024-11-11T21:31:21+05:30

    పెనుగంచిప్రోలులో దారుణం

    • పెనుగంచిప్రోలు గ్రామంలో దారుణం

    • వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

    • కుక్కల దాడిలో తొలుత తీవ్రంగా గాయపడిన బాలుడు

    • నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...

    • చికిత్స పొందుతూ బాలుడు మృతి

    • ఆరుబయట ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా 10 వీధి కుక్కలు దాడి

  • 2024-11-11T21:17:52+05:30

    సీఎంను కలిసిన జీవీ రెడ్డి

    ముఖ్యమంత్రిని కలిసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి

    ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు సీఎం కు కృతజ్ఞతలు చెప్పిన జీవీ రెడ్డి

  • 2024-11-11T20:51:26+05:30

    సీఎంను కలిసిన పట్టాభి

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి

    స్వచ్చాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు సీఎం కు కృతజ్ఞతలు చెప్పిన పట్టాభి

    తన మద్దతు ఉంటుందని బాగా పని చేయాలని పట్టాభికి సూచించిన చంద్రబాబు

  • 2024-11-11T20:28:07+05:30

    బడ్జెట్‌పై హర్షం

    • ఏపీ వార్షిక బడ్జెట్‌పై బీజేపీ నేతల హర్షం

    • సామాన్యుడి బడ్జెట్‌గా పేర్కొన్న బీజేపీ రాజానగరం నియోజకవర్గం కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి

    • బడ్జెట్‌ అన్ని వర్గాలను సంతృప్తి పర్చేలా ఉందన్న వీరన్న చౌదరి

    • జగన్ రాష్ట్రాన్ని అప్పులమయం చేసినా, కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాట పట్టిస్తుందన్న వీరన్న చౌదరి

  • 2024-11-11T19:34:56+05:30

    ఏపీకి భారీగా పెట్టుబడులు..

    • సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

    • టాటాకంపెనీల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సీఎం భేటీ

    • రత టాటా భారత దేశ అభివృద్దిలో తన మార్కును వదిలి వెళ్లారన్న చంద్రబాబు

    • ఏపి అభివృద్దికి ఆయన ఎంతో దోహద పడ్డారని గుర్తుచేసుకున్న సీఎం

    • టాటాగ్రూప్ ఏపితో పాటు దేశ అభివృద్దిలో చాలా ముఖ్యమైన భాగస్వామి

    • ఏపిలో కొన్ని కీలక రంగాల్లో పెట్టుబడులపై మాట్లాడుకున్నాం

    • విశాఖలో కొత్త ఐటి సెంటర్ ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించేందుకు టాటా గ్రూపు సిద్ధంగా ఉందన్న చంద్రబాబు

    • రాష్ట్రంలో పరిశ్రమలు, టూరిజం అభివృద్దికోసం 20 హోటళ్ల (తాజ్ , వివంతా, గేట్ వే, సెలక్షన్స్, జింజర్ ) కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టే అంశంపై చర్చ

    • వాయు, సౌర విద్యుత్ లో 5 గెగావాట్ల సామర్ధ్యం కలిగిన ప్రాజక్టుల కోసం దాదాపు 40 వేల కోట్లు పెట్టుబడులపై చర్చ

    • డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ప్రాధమిక ఆరోగ్య రంగంలో వాడడంపైనా చర్చ

    • రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇంటికో పారిశ్రామికవెత్త కల నెరవేర్చడంపై చర్చ

    • ఏపి అబివృద్దికి నేటి సమావేశం చుక్కానిలా పనిచేస్తుందన్న చంద్రబాబు

  • 2024-11-11T19:28:20+05:30

    ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి ప్రతిష్టాత్మక 'స్కోచ్' అవార్డు

    అవార్డు సాధించడం పై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం-

    ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    ప్రతిష్టాత్మక 'స్కోచ్' అవార్డును ఏపీఎస్ఆర్టీసీ దక్కించుకోవడం గర్వకారణమన్న మం్రి

    యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ

    బస్సుల్లో డిజిటల్ టికెట్ల జారీ చేస్తున్నందుకు, ఈ అవార్డు సొంతం చేసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ

  • 2024-11-11T19:12:48+05:30

    ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్

    • రేపు ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

    • ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్న సీఎం రేవంత్

    • అక్కడి నుంచి మహారాష్ట్ర ప్రచారానికి వెళ్లనున్న సీఎం

    • రెండు రోజుల పాటు మహారాష్ట్ర లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్

  • 2024-11-11T19:06:21+05:30

    ఢిల్లీకి కేటీఆర్.. కేంద్ర మంత్రితో భేటీ

    • ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

    • కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ

    • అమృత్ పథకం అవకతవకలపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన కేటీఆర్

    • రేపు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ని కలిసే అవకాశం

    • రేపు ఉదయం 11గంటలకు మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్

  • 2024-11-11T19:01:37+05:30

    జాతీయ విద్యాదినోత్సవ వేడుకల్లో సీఎం

    • విజయవాడలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

    • హాజరైన మంత్రులు లోకేష్, సత్య కుమార్, కొల్లు రవీంద్ర

  • 2024-11-11T18:51:53+05:30

    164 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

    • జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ‌164 మందిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం

    • ఒకొక్కరికి రూ.20 వేల నగదు పారితోషికంతో సత్కారం

  • 2024-11-11T17:12:57+05:30

    బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత

    • బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రికత్త

    • విద్యార్థిని ఆత్మహత్య కు నిరసనగా ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

    • ఏబీవీపీ కార్యకర్తలపై ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది దాడి

    • ఒకరికి తీవ్ర గాయాలు

    • భైంసా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ కుటుంబ సభ్యుల ఆందోళన

    • క్యాంపస్ లోకి తాము రాకముందే డెడ్ బాడీనీ ఆసుపత్రి కి తరలించడంపై ఆగ్రహం,

    • ఆగ్రహం తో బాసర ఎస్ఐని తోసేసిన మృతురాలి తల్లి

  • 2024-11-11T16:25:14+05:30

    ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం

    • ఎమ్మెల్సీలతో మాజీ సీఎం జగన్ సమావేశం.

    • శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహం పై ఎమ్మెల్సీలకు జగన్ దిశా నిర్దేశం

    • మరోవైపు శాసనసభ సమావేశాలకు వెళ్లిన జగన్

    • మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్న జగన్

    • జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు