Share News

రూ.3.50 కోట్ల పాత స్టాంపులు కాల్చివేత

ABN , Publish Date - Jan 23 , 2024 | 11:37 PM

జిల్లా ఖజానా శాఖలో 2009వ సంవత్సరం నుంచి వినియోగానికి ఉపయోగపడకుండా ఉన్న రూ.3.50 కోట్ల విలువగల స్టాంపులను జిల్లా ట్రెజరీ అధికారులతో కూడిన కమిటీ సమక్షంలో మంగళవారం కాల్చివేశారు.

రూ.3.50 కోట్ల పాత స్టాంపులు కాల్చివేత

కడప(కలెక్టరేట్‌), జనవరి 23: జిల్లా ఖజానా శాఖలో 2009వ సంవత్సరం నుంచి వినియోగానికి ఉపయోగపడకుండా ఉన్న రూ.3.50 కోట్ల విలువగల స్టాంపులను జిల్లా ట్రెజరీ అధికారులతో కూడిన కమిటీ సమక్షంలో మంగళవారం కాల్చివేశారు. ఈ సందర్భంగా జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2009 నుంచి 10, 20 పైసల స్టాంపుల నుంచి రూ.5, 10, 20 ఇన్సూరెన్స్‌ స్టాంపులు, రూ.50ల జ్యుడీషీయల్‌ స్టాంపుల విక్రయాలను ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘ కాలంగా చెల్లుబాటులో లేని స్టాంపులకు కాల్చివేయాలని జీవో నెంబరు 135 జారీ చేసిందన్నారు. చైర్మన్‌ జాయింట్‌ కలెక్టర్‌ గణేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు కమిటీలోని ఫైర్‌శాఖ, పంచాయతీ, డీఆర్వో, జిల్లా రిజిస్ర్టార్‌, ఏఎస్పీలతో కూడిన కమిటీ సభ్యుల సమక్షంలో స్టాంపులను పాత కలెక్టరేట్‌లో పెద్ద గొయ్యి తీసి పెట్రోల్‌ పోసి కాల్చివేశామన్నారు. ఖజానా శాఖలో స్ట్రాంగ్‌ రూములను శుభ్రం చేసి మిగతా రికార్డుల భద్రతకు వినియోగించు కునేందుకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీఓ హరిణి, ఖజానా శాఖ రాష్ట్ర ఉద్యోగ సంఘ అధ్యక్షుడు రవికుమార్‌, ఎ్‌సటీఓలు ప్రభుదా్‌స, ఖాదర్‌తో పాటు ట్రెజరీ శాఖకు చెందిన ఎస్టీవోలు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2024 | 11:37 PM