కేసీ చివరి ఆయకట్టుకు నీరందించాలి
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:31 AM
కేసీ కెనాల్ చి వరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో గళం విప్పారు.
- అసెంబ్లీలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కేసీ కెనాల్ చి వరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో గళం విప్పారు. ఆళ్లగడ్డ నియోజక వర్గంలో కేసీ కెనాల్ ప్రధాన వనరుగా పంటలు సాగు చేస్తున్న రైతు లకు ఏటా ఖరీఫ్, రబీలో నీరందక పడుతున్న ఇబ్బందులను పరిష్క రించాలని అసెంబ్లీలో సభాపతిని కోరారు. ముచ్చుమర్రి వద్ద అదనం గా మూడు పంపులను ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు, కడప జిల్లాల్లోని లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించేందుకు గుండ్రేవుల ప్రాజెక్టు పనులను త్వరితగతిన ప్రారంభించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు డిసి్ట్రబ్యూషన ఛానల్స్ నేటికీ పూర్తి చేయ లేద న్నారు. కేసీ కెనాల్, తెలుగు గంగ కాల్వల అభివృద్ధిపై దృష్టి సారిం చాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో చర్చించారు.