ఘనంగా ఇంజనీర్స్ డే
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:20 AM
మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నేటితరం ఇంజనీరు ఆదర్శంగా తీసుకోవాలని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మద్దిపాటి సత్యనారాయణ అన్నారు.
కొవ్వూరు, సెప్టెంబరు 15: మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నేటితరం ఇంజనీరు ఆదర్శంగా తీసుకోవాలని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మద్దిపాటి సత్యనారాయణ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ దినోత్సవాన్ని ఆదివారం స్థానిక ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ట్రాన్స్‌కో కొవ్వూరు ఏడీ పి.అచ్యుతాచారి, ఏఈలు డి.జగదీశ్వరరావు, సీహెచ్ శ్రీనివాసరావులను సత్కరించారు. సత్యనారాయణ, అచ్యుతాచారి మాట్లాడుతూ విశ్వేశరయ్య ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులను, డ్రైనేజీలను రూపుదిద్ది భావితరానికి ఇంజనీరింగ్ వ్యవస్థలో దిశా నిర్దే శం చేశారన్నారు. కార్యక్రమంలో యనమదల సుబ్రహ్మణ్యం, బూరుగుపల్లి వెంకటేశ్వరరావు, కలగర ఏడుకొండలు, ముళ్ళపూడి కాశీ విశ్వనాధరావు పాల్గొన్నారు.