Share News

Chandrababu : ఎమ్మార్పీ ఉల్లంఘనకు 5 లక్షల జరిమానా

ABN , Publish Date - Oct 29 , 2024 | 05:14 AM

ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించా లి. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్‌ రద్దు చేయా లి’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Chandrababu : ఎమ్మార్పీ ఉల్లంఘనకు 5 లక్షల జరిమానా

రెండోసారి చేస్తే.. లైసెన్స్‌ రద్దు

బెల్టు షాపులు పెట్టినా అవే చర్యలు

మద్యం వ్యాపారంపై సీఎం ఆదేశాలు

పక్క రాష్ర్టాలకు ఇసుక వెళ్లకూడదు: బాబు

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ‘ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించా లి. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్‌ రద్దు చేయా లి’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మద్యం, ఇసుకపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ‘బెల్టు షాపులు ఎక్కడా ఉండకూడదు. బెల్టులకు మద్యం సరఫరా చేసే లైసెన్సీలకు మొదటిసారి రూ.5 లక్షలు జరిమానా విధించాలి. రెండోసారి పట్టుబడితే లైసెన్స్‌ రద్దు చేయాలి. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ పై కఠినంగా వ్యవహరించాలి. ప్రతి మద్యం షాపులో సీసీ కెమేరాలు ఉండాలి. ఫిర్యాదుల కోసం ఒక టోల్‌ ఫ్రీ నంబ రు ఏర్పాటు చేయాలి. షాపులో ధరల పట్టిక ప్రదర్శించాలి. అలాగే ఇసుక పొరుగు రాష్ర్టాలకు ఒక్క లారీ ఇసుక వెళ్లకూడదు. ఇసుకలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే సంబంధి త అధికారులే తొలి బాధ్యులు అవుతారు’ అని అన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 05:14 AM