చంద్రబాబు కార్యదక్షతతోనే విపత్తు నుంచి బయటకు..!
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:54 AM
సీఎం చంద్రబాబు కార్యదక్షత వల్లే వరద బాధితులు విపత్తు నుంచి బయటపడ్డారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అ న్నారు.
వన్‌టౌన్, సెప్టెంబరు 11: సీఎం చంద్రబాబు కార్యదక్షత వల్లే వరద బాధితులు విపత్తు నుంచి బయటపడ్డారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అ న్నారు. సత్యసాయి సేవా సెంటర్ ట్రస్ట్ బుధవారం వరద బాధితులకు పంపిణీ చేసేందుకు నిత్యావసర వస్తువులున్న ట్రాక్టర్లకు సీతారామపురంలోని సత్యసాయి మందిరం వద్ద ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, సత్యసాయి ట్రస్ట్ ఎండీ ఆర్.జె. రత్నాకర్‌తో కలిసి ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారన్నారు. స త్యసాయి ట్రస్ట్ 7వేల మందికి నిత్యావసరాలు పం పిణీ చేయటం ఆనందంగా ఉందన్నారు. వారి సేవలను గుర్తుంచుకుంటామన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సత్యసాయి ట్ర స్ట్ మానవసేవే మాధవ సేవ అని భావించి రూ.2.5 కోట్ల విలువైన సరుకులు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. ట్రస్ట్ నిర్వాహకుడు రత్నాకర్ మా ట్లాడుతూ వరద బాధితులకు తమ వంతు సాయం అందించే క్రమంలో 600 మంది సభ్యులు పాల్గొన్నారన్నారు. నేషనల్ సేవాదళ్ కో-ఆర్డినేటర్ ఎస్. కోటేశ్వరరావు, గ్లోబల్ కౌన్సిల్ మెంబర్ ఎస్.జి.చలం, సత్యసాయిసేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, వైస్ ప్రెసిడెంట్ సి.హెచ్.సురేంద్ర, స్టేట్ సేవాదళ్ కో-ఆర్డినేటర్ కె. శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
హీరో సాయితేజ్‌తో కలిసి..
వన్‌టౌన్: సెంట్రల్‌లోని 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరిపేటలో చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో బు ధవారం వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, హీరో సాయి తేజ్ పాల్గొని బాధితులకు సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఆప ద వచ్చినా సాయం చేసేందుకు మెగా ఫ్యామిలీ ఎ ప్పుడూ ముందుంటుందన్నారు. మాజీ టీడీపీ ఫ్లోర్‌లీడర్ యర్రబోతు రమణరావు, 57వ డివిజన్ అధ్యక్షుడు బోడి సన్యాసిరావు (నాని), నేతలు యర్రబో తు కనకారావు, మచ్చా ఇమ్మానియేల్, జనసేన నేత లు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.
40వ డివిజన్‌లో..
పశ్చిమలోని 40వ డివిజన్ పరిధి భవానీపురం, కోళ్లఫారం రోడ్డు, 40 గజాల ప్లాట్లలో వరద బాధితులకు బుజ్జన్న వాలీబాల్ టీమ్ ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ ఖాజా (వక్ఫ్‌బోర్డు డైరెక్టర్) ఆధ్వర్యంలో బాధితులకు 40వ డివిజన్ అధ్యక్షుడు చిన సుబ్బయ్య పాల్గొని చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. డివిజన్ నేతలు ఆర్.రామిరెడ్డి, రాజారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
కేఎల్‌రావు నగర్‌లో..
చిట్టినగర్: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. బుధవారం కె.ఎల్.రావునగర్‌లో వ రద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చే శారు. అనంతరం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నగరంతోపాటు నగర ప్రజల్ని సాధారణ స్థితికి తీ సుకొచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనంతరం బాధితులకు టీడీపీ నేతలు కె.నాగుల్‌మీరా, ఎం.ఎస్ బేగ్, గుర్రం కొండతో కలిసి ని త్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీడీపీ 46వ డివిజన్ అధ్యక్షుడు ప్రభుదాస్, లోకేష్ పాల్గొన్నారు.