శ్రీశైలం ఈవోగా చంద్రశేఖర ఆజాద్ బాధ్యతలు
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:11 AM
శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఎస్‌ఎస్ చంద్రశేఖర ఆజాద్ సోమవారం ఉదయం ఆలయ పరిపాలన భవనంలోని ఈవో చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.
శ్రీశైలం, నవంబరు 18(ఆంధ్రజోతి): శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఎస్‌ఎస్ చంద్రశేఖర ఆజాద్ సోమవారం ఉదయం ఆలయ పరిపాలన భవనంలోని ఈవో చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాలను అనుసరించి ఆలయ అర్చకులు, వేదపండితులు ఈవోగా భ్యాతలు చేపట్టిన ఎస్‌ఎస్ చంద్రశేఖర ఆజాద్‌కు వేదాశీర్వాదం పలికారు. అనంతరం ఈవో దేవస్థానం అన్ని విభాగాల యూనిట్ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేయాలన్న ప్రగాఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అదేవిధంగా భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, శ్రీశైలక్షేత్ర సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, గో సంరక్షణ, చెంచు గూడేలలో స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవాలు నిర్వహించడం, క్షేత్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.