మిరప పంట దున్నివేత
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:35 AM
న్నో ఆశలతో అప్పులు చేసి సాగు చేసిన పంటలను రైతులు దున్నేస్తున్నారు.
ఉయ్యాలవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఆశలతో అప్పులు చేసి సాగు చేసిన పంటలను రైతులు దున్నేస్తున్నారు. ఉయ్యాలవాడ మండలంలోని తుడుములదిన్నె గ్రామానికి చెందిన కర్ణాటి తిరుమలేశ్వర్‌రెడ్డి గురువారం ఆరు ఎకరాల్లోని మిరప పంటను దున్నేశాడు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంతో పంటకు తెగులు సోకి మొత్తం పూర్తిగా దెబ్బతింది. దీంతో పంటను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక మూడు నెలల పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. రైతు ఎకరాకు కౌలుతో కలిపి రూ.2లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట తెగులు కారణంగా రైతుకు మొత్తం రూ.12లక్షల మేర నష్టం వాటిల్లింది.